Depression : ఉరుకుల,పరుగుల జీవితంలో చాలామంది ఒత్తిడికి గురవుతూ ఉన్నారు. మనిషి సంతోషంగా జీవించాలి అంటే మంచి ఆరోగ్యంతో పాటు, మానసిక ఆరోగ్యం కూడా చాలా అవసరం. ఈరోజుల్లో చాలామంది డిప్రెషన్ అనే ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారు. డిప్రెషన్ కారణంగా చాలామంది అనారోగ్యం బారిన పడుతూ ఉంటారు. డిప్రెషన్ అంటే అది ఒత్తిడి వల్ల మెదడును దెబ్బతీస్తుంది. డిప్రెషన్ వల్ల ఆరోగ్యంగా ఉన్న ఆలోచన విధానానికి ఆటంకం కలుగుతుంది.
ఉదయాన్నే కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లు చేసుకోవడం వల్ల మానసిక ఒత్తిడికి దూరం కావచ్చని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. ప్రతి ఉదయాన్నే సూర్యకాంతిని పొందడం వల్ల మన శరీరంలో సంతోషకరమైన హార్మోన్ల ఉత్పత్తి పెరుగి, దాని ఫలితంగా మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. డిప్రెషన్ తో బాధపడేవారు ఈ పద్ధతిని అవలంబిస్తే ప్రయోజనాలు పొందవచ్చు. అలాగే శరీరంలో నిద్ర చక్రాన్ని నియంత్రించడంలో మెలటోనిన్ ఉపయోగపడుతుంది.
సూర్యాస్తమయం తర్వాత చీకటి పడడం వల్ల మెదడులో మెలటోనిన్ హార్మోన్ స్రావం పెరుగుతుంది. అలాగే మళ్లీ పగటిపూట సూర్యరష్మికి గురి కావడం వల్ల మెలటోనిన్ శాతం తగ్గుతుంది. దీని ఫలితంగా నిద్రలేమి సమస్య తగ్గుముఖం పడుతుంది మెలటోనిన్ స్థాయిలను తగ్గించడానికి కాసేపు ఎండలో ఉండడం ఉత్తమం. ఇది మానసిక స్థితిని మెరుగుపరచడంలో దోహదపడుతుంది.
డిప్రెషన్ తో ఇబ్బంది పడేవారు ప్రతిరోజు ఒకే సమయానికి నిద్ర మేలుకోవాలి. ఒక నిర్దిష్ట సమయంలో నిద్ర లేవడం వల్ల జీవ గడియారం సరిగా పనిచేసే డిప్రెషన్ సమస్య దూరం అవుతుంది. అలాగే ప్రతిరోజు కొన్ని శ్వాస వ్యాయామాలు చేయడం కూడా డిప్రెషన్ కు మంచి ఔషధం. వ్యాయామంలో మీ మనసును కేంద్రీకరించడంలో సహాయపడుతుంది. దానివల్ల ఆందోళన ,ఒత్తిడి తగ్గుతుంది. డిప్రెషన్ చికిత్సలో వ్యాయామం చాలా ప్రభావం చూపుతుంది. మానసిక వ్యాయామ ఎండార్ఫిన్ హార్మోన్లను విడుదల చేస్తుంది.
ప్రతిరోజు ఉదయాన్నే అల్పాహారం ఖచ్చితంగా తీసుకోవాలి. లేకపోతే శరీరానికి మానసికంగా చాలా హానికరం. సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరము, మనసు ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు క్రమబద్ధీకరించడమే కాకుండా రోజంతా శక్తి ని ఇస్తుంది.