Diet According to Blood Group : సంపూర్ణ ఆరోగ్యం పొందడానికి మనిషి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఆహారంలో శరీరంకి కావాల్సిన ప్రోటీన్స్, విటమిన్స్ లభించే ఆహారం తీసుకుంటే చాలా తక్కువ వరకు అనారోగ్య సమస్యలను ఎదుర్కోవచ్చు. అదేవిధంగా మన బ్లడ్ గ్రూప్ ని బట్టి దానికి తగిన మోతాదులో ఆహారాన్ని తీసుకుంటే చాలా వరకు మన ఆరోగ్యాన్ని కాపాడుకున్న వారిమి అవుతాము. ఇక ఆలస్యం చేయకుండా ఏ బ్లడ్ గ్రూపు వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి వెంటనే తెలుసుకుందాం..
O బ్లడ్ గ్రూప్.. ఓ బ్లెడ్ గ్రూపు కలిగిన వారు ఎక్కువగా ప్రోటీన్లు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. ముఖ్యంగా మాంసము, చేపలు, ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు తీసుకుంటే మంచిది. వీటితో పాటుగా చిక్కుళ్లను, బీన్స్ వంటి వాటిని కూడా వీరు ఆహారంలో చేర్చాలి. అదేవిధంగా బ్రోకలీ,ఆలివ్ ఆయిల్, బచ్చలి కూర లాంటివి కూడా తీసుకోవాలి. దినుసుల విషయానికొస్తే గోధుమలు, మొక్కజొన్న తీసుకోవాలి. అలాగే పాల ఉత్పత్తులకు దూరంగా ఉండటమే మంచిది.
A బ్లడ్ గ్రూప్.. ఇక ‘ఏ’ బ్లడ్ గ్రూప్ వారు పండ్లు, కూరగాయలు, సీ ఫుడ్, తృణధాన్యాలు తీసుకోవాలి. A బ్లడ్ గ్రూప్ వారు పైనాపిల్, ఆలివ్ ఆయిల్, కూరగాయలు, సి ఫుడ్, సోయా గోధుమలు, మొక్కజొన్న, కిడ్నీ బీన్స్ ఇలాంటివి తీసుకోవడం మంచిది.
B బ్లడ్ గ్రూప్.. బి బ్లడ్ గ్రూప్ వాళ్ళు పండ్లు, పాల ఉత్పత్తులు, తోపాటు మాంసం ఆహారంలో భాగం చేసుకోవాలి. అలాగే ఒకవేళ వీరు బరువు సమస్యను ఎదుర్కొంటే అది తగ్గడం కోసం పచ్చి కూరగాయలు, లివర్, లైకోరైస్ టీ తాగాలి, గుడ్లు తినాలి.
AB బ్లడ్ గ్రూప్..‘ఏబీ’ బ్లడ్ గ్రూప్ వాళ్లు రోజు, చేపలు, ధాన్యాలు, పండ్లు, కూరగాయలను తీసుకోవాలి. వీటితోపాటు చికెన్, మొక్కజొన్న, బీన్స్ ఆహారంలో చేర్చుకోవాలి.