Early Puberty : కొన్నీ రోజులకు ముందు అమ్మాయిల రజస్వల వయసు 10 సంవత్సరాలు దాటిన తర్వాత ఉండేది. కానీ కాలక్రమేణా మారుతున్న జీవనశైలిలో ఆ వయసు కూడా మార్పు చెందుతూ వచ్చింది. ఇప్పటి అమ్మాయిలు 8, 9 సంవత్సరాలకే రజస్వల అవుతున్నారు. ఇలా అవడం అమ్మాయిల ఆరోగ్యానికి ఏదైనా హానికరమా? అసలు దాని వెనుక ఉన్న కారణాలను తెలుసుకుందాం.
నిజానికి అమ్మాయిల రజస్వల వయసు 12 సంవత్సరాలు.ఇలా అవ్వడం అంటే అమ్మాయిలు ఆరోగ్యంగా ఉన్నారు సూచిక. 10 సంవత్సరాల కంటే ముందే రజస్వల అయితే ఖచ్చితంగా డాక్టర్ నీ సంప్రదించవలసిందే. అయితే ఇలా ముందే రజస్వల అవ్వడానికి కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
గ్రామీణ వాతావరణంలో ఉండే పిల్లల కంటే, పట్టణ వాతావరణంలో పిల్లలు తొందరగా రజస్వల అవుతారు. దీనికి కారణం పట్టణంలో పిల్లలను అతిగారాభం చేయడం, వారికి ఆహారం విషయంలో అతిగా తినిపించడం. జంక్ ఫుడ్ లాంటి ఫుడ్ అలవాటు చేయడం. వారికి ఎక్సర్సైజ్ లాంటివి అలవాటు చేయకపోవడం. అన్నీ కలిపి చిన్న వయసులోనే వాళ్ల లోపట హార్మోన్ల కలయిక వంటి కారణాలు ఏర్పడతాయి.
ఈ కారణం వల్ల 10 సంవత్సరాల లోపు పిల్లలు తొందరగా రజస్వల అవ్వడం జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పిల్లలు ఇటువంటి ఆహారానికి అలవాటు పడరు కాబట్టి వారు కాస్త ఆలస్యంగానే అవుతారు. తొందరగా రజస్వల అయ్యే పిల్లల్లో “పిసిఒడి” సమస్య వచ్చే అవకాశం ఉంది. దుంపలు,చక్కర శాతం తగు మోతాదులో ఉండే ఆహారాన్ని అందించడం వల్ల ఈ సమస్యను అమ్మాయిలను కాపాడుకోవచ్చు.