Folk Singer Nagaraju : అనితా..ఓ అనిత.. నా అందమైన అనిత’.. ఈ పాట గుర్తుందా ? ఎప్పటికీ ఎవరూ మర్చిపోలేని పాట. ఒకప్పుడు ఈ పాట ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. అసలు ఎటువంటి సోషల్ మీడియా లేని సమయంలోనే ఈ పాట పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. అప్పటి కుర్ర కారు గుండెల్ని ఉర్రూతలూగించింది ఈ పాట.ఇప్పటి యూత్ కి అంతగా తెలియకపోయిన 90’లల్లో పిల్లలకు ఈ పాట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
అలా ఈ పాట 15 ఏళ్ల క్రితం ఓ పెద్ద సంచలనం సృష్టించింది. ఎవరి నోట విన్నా కూడా ఈ పాటే వచ్చేది అంతలా అందరి మనసులో అల్లుకుపోయింది. ఈ పాట వెనక రెండు విరిగిపోయిన హృదయాల బాధ దాగుంది. తన ప్రేమను, తన ప్రేయసిని కోల్పోయిన ఓ వ్యక్తి బ్రేకప్ స్టోరీనే ఈ పాట, అప్పట్లో ఆ స్టోరీ కూడా చాలా పాపులర్ అయింది. నాగరాజు ఈ పాటను రాశాడు. తన ప్రేయసి దూరం కావడంతో ఆమెను తలుచుకుంటూ ఈ పాటను ఆమెకు అంకితం ఇవ్వడం కోసం రాశాడు. ఈ ఒక్క పాటతో నాగరాజు చాలా పాపులర్ అయ్యాడు.
ఆ పాటతో అంత పాపులర్ అయిన నాగరాజు తర్వాత మళ్ళీ ఎక్కడ కూడా కనిపించలేదు. ఇదిగో మళ్లీ ఇప్పుడు 10 సంవత్సరాల తరువాత ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా వెలుగులోకి వచ్చాడు. ఇప్పుడు తను చాలా ఆర్థిక ఇబ్బందులలో ఉన్నట్టు, తన ప్రేమ, బ్రేకప్ గురించి, పెళ్లి, పిల్లలు, జీవితం ఇలా అన్నింటి గురించి చెపుతు బాధతో కంటతడి పెట్టుకుంటు, తను అనిత అనే అమ్మాయిని ప్రేమించినట్టు, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడంతో ఆ అమ్మాయి తనకు దూరమైనట్టు, ఆ బాధతోనే ఈ పాట రాశానని ఈ పాట రాయడానికి తనకు నెల రోజుల టైం పట్టిందని చెప్పాడు.
అంతకు ముందు తను ఒక ఆర్కేస్ట్రాలో సింగర్ గా పనిచేశానని ఆ అనుభవంతో తన మొదటి పాట, అనిత పాటను తానే స్వయంగా పాడినట్లు తెలిపారు. ప్రేమ విఫలం అయిన తర్వాత తనకు మరో అమ్మాయితో పెళ్ళి జరిగింది అని, తనకు భార్యగా మంచి అమ్మాయి వచ్చిందని, తన పేరు దేవిక అని, తమకు ఇప్పుడు ఇద్దరూ అబ్బాయిలని చెప్పు కొచ్చాడు. అయితే నాగరాజు జీవితంలో పెను విషాదమే సంభవించింది అని చెప్పవచ్చు. తన మొదటి అబ్బాయి చెముడు ,మూగ తో బాధపడుతున్నాడు.
ఆ అబ్బాయిని చూస్తూ రెండో అబ్బాయి కూడా అదే విధంగా సైగలు చేస్తున్నాడని కన్నీటి పర్యంతం అవుతూ చెప్పుకొచ్చాడు. తన కుటుంబాన్ని పోషించడం కోసం కొన్ని రోజులు పాన్ షాప్ డబ్బా పెట్టి జీవనోపాధిని పొందనాని నాగరాజు చాలా బాధతో చెప్పాడు. తను నమ్ముకున్న కళామతల్లి తనను కాపాడుతుందని నమ్మకంతో హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యానని అతి త్వరలోనే అనిత 2 సాంగ్ తో మళ్లీ మీ ముందుకు వస్తానని చెప్పాడు నాగరాజు.