Food to Reduce Depression : ప్రపంచవ్యాప్తంగా ఈ రోజుల్లో చాలామంది మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఈ విషయం చాలా అధ్యయనాల్లో కూడా వెళ్లడైంది. ముఖ్యంగా మెడికల్ జర్నల్ లో ఈమధ్య వచ్చిన ఒక రిపోర్ట్ ప్రకారం డిప్రెషన్ లో ఉన్నవాళ్లు అధికంగా ఆహారం తీసుకుంటున్నారని వాళ్ళు తెలిపారు. అయితే సరైన మోతాదులో సరైన ఆహారాన్ని తీసుకుంటే అధిక బరువు పెరగకుండానే ఈ డిప్రెషన్ సమస్య నుంచి బయటపడవచ్చు, అని నిపుణులు తెలుపుతున్నారు.
పోషకాహార లోపం శరీరంలో ఏర్పడితే ట్రిప్టోఫాన్, టైరోసిన్, మిథియోనిన్, ఫిలైన్ అలనిన్ వంటి కొన్ని రకాల అమైనో ఆమ్లాలు శరీరానికి సమకూరవు. అయితే ఈ అమినో యాసిడ్స్ వల్ల ఉపయోగం ఏమిటంటే.. ముఖ్యంగా ఈ యాసిడ్స్ డిప్రెషన్ తో పాటు కొన్నిరకాల డిజార్డర్లని తగ్గిస్తాయి. డిప్రెషన్ నుంచి బయటపడాలంటే తీసుకోవలసిన ఆహారం ఏమిటో తెలుసుకుందాం..
ఒమెగా-3 -ఫ్యాటీయాసిడ్స్ ఉన్న సాల్మన్ చేపలు, సీఫుడ్ తినడం మంచిది. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్-సి ఉన్న పండ్లు, కూరగాయలు ఫ్రీరాడికల్స్ ని తగ్గించి, మెదడును చురుకుగా ఉంచుతాయి. అలాగే క్యారెట్, గుమ్మడి, సంత్రాలు, టొమాటోలు, నట్స్, సీడ్స్ కూడా ఫ్రీ రాడికల్స్ ని తొలగించడంలో సాయపడతాయి.
వీటితో పాటు చికెన్, బీన్స్, బఠాణి గింజలు, సోయాగింజలు కూడా డిప్రెషన్ నుంచి రక్షిస్తాయి. ఈ కొన్ని ఆహార నియమాలను పాటిస్తూ డిప్రెషన్ బారిన పడిన వాళ్ళు ఆ సమస్య నుంచి బయటపడవచ్చు.