Food to Reduce the Problem of Anemia : శరీరంలో రక్తం లోపిస్తే రక్తహీనత సమస్య వస్తుంది. శరీరంలో రక్తం లోపించడాన్ని “అనీమియా” అంటారు. సహజంగా శరీరంలో రక్తం వృద్ధి చెందాలంటే కొన్ని రకాల ఆహారాలను తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..మన శరీరంలోని ఎర్రరక్త కణాలలో హిమోగ్లోబిన్ లో కనిపించే ఒక ఖనిజం ఐరన్.
హిమోగ్లోబిన్ ఆక్సిజన్ ను మన శరీర భాగాలకు చేరవేస్తుంది. అలాగే ఐరన్ లోపం ఉన్నప్పుడు ఎర్ర రక్త కణాలు సరిగా ఉత్పత్తి కాలేవు. ఐరన్ లోపాన్ని తగ్గించుకోవాలంటే ముఖ్యంగా చేపలు, మాంసం, గుడ్లు, చిక్కుళ్ళు, ఆకుకూరలు, పప్పులు లాంటివి ఆహారంలో చేర్చాలి. అలాగే విటమిన్ బి12 అనేది ఉత్పత్తికి చాలా ఉపయోగపడుతుంది. విటమిన్ బి12 లోపిస్తే మాత్రం ఎర్ర రక్త కణాలు సరిగా పనిచేయవు.
అందువల్ల విటమిన్ బి12 ఉండేలాంటి పాల ఉత్పత్తులను, గుడ్లను, మాంసాన్ని తీసుకోవాలి. పోలిక్ యాసిడ్ లోపం ఉంటే కూడా ఎర్ర రక్త కణాలు సరిగా వృద్ధి చెందవు. పోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్న మాంసం, చేపలు, ఆకుకూరలు, గుడ్లు, బీన్స్, చిక్కులు కచ్చితంగా ఆహారంలో భాగం చేయాలి. ప్రోటీన్లు శరీర నిర్మాణాత్మకానికి చాలా ఉపయోగపడతాయి.
ప్రోటీన్లు శాతం తగ్గితే కణాల ఉత్పత్తికి ఆటంకం కలిగినట్టే ప్రోటీన్లకు ఎక్కువగా చిక్కుళ్ళు, ధాన్యాలు వాటిల్లో లభిస్తాయి. వీటన్నిటితోపాటు నట్స్, సీడ్స్ కూడా ఆహారంలో భాగం తీసుకోవాలి. ముఖ్యంగా బాదం, సన్ఫ్లవర్ గింజలు, గుమ్మడి గింజలు, ఐరన్ విటమిన్ ఈ తీసుకుంటే ఎర్ర రక్త కణాలు వృద్ధి చెందుతాయి. అలాగే సిట్రస్ పండ్లు కూడా ఎర్ర రక్త కణాల అభివృద్ధికి బాగా ఉపయోగపడతాయి.
ద్రాక్ష, నిమ్మకాయలు వంటి సిట్రస్ పండ్లులో విటమిన్ సి, పుష్కలంగా లభిస్తుంది. బీట్రూట్ కూడా ఐరన్, విటమిన్ ని పుష్కలంగా ఉన్నటువంటిది. బీట్రూట్ కూడా ఆహారంలో భాగం చేసుకోవాలి. బీట్ రూట్ లో ఉండే నైట్రేట్స్, రక్తప్రసరణ సవ్యంగా జరగడానికి ఆక్సిజన్ సరిగా అందడానికి ఉపయోగపడుతుంది.