Foods to Increase Iron in Women : సహజంగా మహిళల్లో ఐరన్ శాతం చాలా తక్కువగా ఉంటుంది. మహిళల్లో ఐరన్ శాతం తగ్గితే వారికి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి ఐరన్ శాతాన్ని పెంచుకోవాలంటే ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి, ఈ హిమోగ్లోబిన్ పెరగటానికి కచ్చితంగా ఐరన్ కావాలి. హిమోగ్లోబిన్ అనేది శరీరంలో సరైన పనితీరుకు ఉపయోగపడుతుంది.
రక్తహీనత లోపించకుండా ఉండాలంటే, ఎప్పుడు శరీరం ఆరోగ్యంగా నీరసం లేకుండా ఉండాలంటే, మహిళలకు ఖచ్చితంగా ఐరన్ అత్యవసరం. పోషక నిపుణులు కూడా ఇదే చెబుతుంటారు. ఐరన్ లోపం కారణంగా మహిళలు అలసటను, బలహీనతను ఎదుర్కోవాల్సి వస్తుంది. దానికి ఆహార పదార్థాలు ద్వారానే సాధ్యం అని నిపుణులు తెలియజేస్తున్నారు.
శాఖాహారం తీసుకునే మహిళల్లో ఐరన్ శాతం తగ్గుతుంది. కాబట్టి ఐరన్ శాతం పెరిగే ఆహారంపై అటువంటి మహిళలు శ్రద్ధ చూపించాలని నిపుణులు తెలియజేస్తున్నారు. మహిళలు ఐరన్ లోపం వల్ల కంటిపై కూడా ఎఫెక్ట్ పడుతుంది. శరీరంలో ఐరన్ లోపిస్తే కంటి సమస్యలు వచ్చి కళ్ళు మసకబారడం సరిగా కనిపించకపోవడం లాంటివి జరుగుతాయి. ఈ విషయంలో వైద్యులను తప్పకుండా సంప్రదించాలి. మరి మహిళల్లో ఐరన్ లెవెల్స్ పెరగాలంటే ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి..

దానిమ్మ : దానిమ్మ పండ్లల్లో శరీరానికి కావలసినంత ఐరన్ లభిస్తుంది. ముఖ్యంగా ఈ పండల్లాల్లో విటమిన్ సి, క్యాల్షియం, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అలాగే దానిమ్మ పండులో ఉండే విటమిన్ సి శరీరంలో ఐరన్ శాతాన్ని పెంచడం ద్వారా రక్తహీనతను నివారిస్తుంది.
బచ్చలికూర : బచ్చలి కూరలో ఇనుముకు సంబంధించిన మూలం ఉంటుంది. బచ్చలికూరలో విటమిన్ సి కూడా అత్యధికంగా దొరుకుతుంది. శరీరంలో ఐరన్ శాతాన్ని పెంచడంతోపాటు శరీరాన్ని కావలసినంత ఐరన్ ని సమృద్ధిగా అందించి రక్తహీనతను నివారిస్తుంది.
బీట్ రూట్ : బీట్రూట్ తినడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుంది. అలాగే బీట్రూట్ లో ఐరన్ శాతం కూడా అత్యధికంగా ఉండడం వల్ల రక్తహీనత తగ్గుముఖం పడుతుంది.
గుమ్మడికాయ గింజలు : గుమ్మడి గింజలు లో ఇనుము ఉంటుంది. ఈ గింజలు తీసుకోవడం వల్ల కూడా శరీరం కావలసినంత ఐరన్ దొరుకుతుంది.
