Hair Care Tips : రాత్రి మిగిలిపోయిన అన్నం ను కొంతమంది తెల్లవారి ఫ్రై చేసుకుని తింటూ ఉంటారు. మరికొంతమంది పడేస్తూ ఉంటారు. కానీ మిగిలిపోయిన అన్నంతో మీ జుట్టును సంరక్షించుకోవచ్చు, హెల్తీగా పెంచవచ్చు అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని,
అందులో ఐదు టేబుల్ స్పూన్లు రాత్రి అన్నం, మందార ఆకులు, ఒక మందార పువ్వు, వన్ టేబుల్ స్పూన్ మునగాకు పొడి ,ఒక కప్పు ఫ్రెష్ అలోవెరా జెల్, రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
![]()
తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ వేసి జుట్టు కుదురులకు చివరి వరకు పట్టేలాగా పెట్టిన తర్వాత, షవర్ క్యాప్ ధరించాలి. గంట తర్వాత తల స్నానం చేయాలి.
చుండ్రు సమస్య పోతుంది. తెల్ల వెంట్రుకలు త్వరగా రాకుండా ఈ ప్యాక్ నివారిస్తుంది. చిట్లిపోయిన జుట్టును కూడా మంచిగా చేస్తుంది. వారానికి రెండు సార్లు అన్నంతో ఇది ట్రై చేసి, నిగారింపు కలిగిన జుట్టుని మీ సొంతం చేసుకోండి.
