• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home Life Style

Harms to Children with Mobile : పిల్లలు అదే పనిగా ఫోన్ వాడుతున్నారా.. వెంటనే ఆ అలవాటు మాన్పించండి..

Rama by Rama
November 10, 2023
in Life Style
0 0
0
Harms to Children with Mobile : పిల్లలు అదే పనిగా ఫోన్ వాడుతున్నారా.. వెంటనే ఆ అలవాటు మాన్పించండి..
Spread the love

Harms to Children with Mobile : ఈరోజుల్లో ఎవరి చేతిలో చూసినా కూడా ఫోన్ కనిపిస్తుంది. అది మన రోజులు వారి జీవితంలో అంత ప్రధానం అయిపోయింది. ముఖ్యంగా పెద్దవారికంటే పిల్లలు ఈ ఫోన్ కి బాగా అడిక్ట్ అవుతున్నారు. దానివల్ల పిల్లల్లో చాలా సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలామంది పిల్లలు గేమ్స్ ఆడటం కోసం మొబైల్ ని ఎక్కువగా యూస్ చేస్తుంటారు. వారికి చేతిలో మొబైల్ ఉంటే బయట ప్రపంచంతో ఇంకా పనే ఉండదు. ఏ పని చేస్తున్నా కూడా వారు గేమ్ ఆడుతూనే చేస్తారు. మరియు ముఖ్యంగా అన్నం తినేటప్పుడు కూడా ఫోన్ నీ పక్కన పెట్టరు.

90 శాతం మంది పిల్లలు అన్నం తినేటప్పుడు కూడా మొబైల్ చేతుల్లోనే ఉంటుందని ఈమధ్య చేసిన అధ్యయనంలో వెళ్లడైంది. ఇలాంటి పిల్లలు  చాలా రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది చాలా ప్రమాదకరమని  నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఫోన్ ప్రభావం పిల్లల శారీరక మరియు మానసిక స్థితిగతుల పైన పడుతుందని వారు తల్లిదండ్రులను అలర్ట్ చేస్తున్నారు.

పిల్లలు ఎక్కువగా స్మార్ట్ ఫోన్ చూస్తే అది వారి మెదడుపై ప్రభావం చూపిస్తుంది. అలాగే ఇలాంటి పిల్లలు నలుగురితో అసలు కలవరు. ఒంటరిగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఎవరితో సరిగా మాట్లాడకపోవడం వల్ల మానసిక సమస్యలు వీరిల్లో ఎక్కువగా ఉంటాయి. ఇది వారు తినే ఆహారంపై కూడా ప్రభావాన్ని చూపిస్తుంది. ఆ గేమ్ ఆనందంలో అది ఆడుతూ వాళ్ళు ఏం తింటున్నారో..? ఎలా తింటున్నారో.? కూడా చూసుకోరు. అది వాళ్ళ ఆరోగ్యాన్ని చాలా దెబ్బతిస్తుంది.

ముఖ్యంగా వీరిలో జీర్ణ క్రియ సక్రమంగా జరగదు. దానివల్ల గ్యాస్, కడుపు ఉబ్బరము, మలబద్ధకం లాంటి జీవక్రియ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువ. అలాగే స్మార్ట్ ఫోన్ ఎక్కువగా వాడే పిల్లల్లో కళ్ళు బలహీనంగా అవుతాయి, భవిష్యత్తులో వాళ్లకి కళ్ళజోడు వచ్చే అవకాశం కూడా ఎక్కువనే. తల్లిదండ్రులు పిల్లలకి మొబైల్ ఫోన్ ఎంత దూరం ఉంచితే అంత మంచిది. లేకపోతే పిల్లల భవిష్యత్తు చాలా ప్రమాదపు అంచుల్లో ఉన్నట్లే.

 


Spread the love
Tags: Children are Addicted to MobileDo mobile phones affect your sleepHarms to Children with MobileMobile Technical TipsTips To Keep Children Away From Mobile Phones
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.