Health Problems : ఒకప్పుడు మనిషి జీవితకాలం 100 సంవత్సరాలు. రాను, రాను ఆ సంఖ్య తగ్గుతూ వచ్చింది. దానికి చాలా కారణాలు ఉన్నటికీ, ఈ మధ్యకాలంలో మాత్రం అనుకోని అకాల మరణాలు వయసుతో సంబంధం లేకుండా మనుషుల్ని మాయం చేసేస్తున్నాయి.ముఖ్యంగా భారతదేశంలో ఆరోగ్య సమస్యలు, అకాల మరణాలకు కారణం అవుతున్నాయి. ఆ సమస్యలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
గుండెపోటు : కొద్దిరోజుల క్రితం వరకు గుండెపోటు అనేది వయసు పైబడిన వారికి వచ్చేది. కానీ ప్రస్తుత కాలంలో గుండెపోటు రావడానికి, వయసుకు ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తూనే ఉన్నాం, డాన్స్ చేస్తూ, ఆటలు ఆడుతూ, కార్ డ్రైవ్ చేస్తూ, మాట్లాడుతూనే, చాలామంది గుండెపోటుతో ఆకస్మిక మరణాలు చెందుతున్నారు. 2019 వ సంవత్సరంలో గుండెపోటుతో 28,005 మరణించారని MCRB రిపోర్టు వెల్లడించింది.
అయితే ఐదేళ్లలో ఈ మరణాలను పరిశీలిస్తే గుండెపోటుతో మరణించే వారి సంఖ్య 53% పెరిగిందని హెల్త్ సర్వేలు తెలియజేస్తున్నాయి.
స్ట్రోక్, లంగ్స్ ప్రాబ్లమ్స్ : మన భారత దేశంలో అకాల మరణాలకు రెండో కారణంగా స్ట్రోక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి సంవత్సరం 1,85,000 మంది దీని బారిన పడి మరణిస్తున్నారు. ప్రతి నాలుగు నిమిషాలకు ఒకసారి ఈ స్ట్రోక్ కారణంతో ఒకరు చనిపోవడం గమనార్హం.
ఇది ఇలా ఉండగా లంగ్స్ డిసీజెస్ కూడా ఈ అకాల మరణాలకు మరో కారణం. భారత దేశంలో శ్వాసకోశ వ్యాధితో చనిపోతున్న వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుందని, 2020లో న్యుమోనియా ,బ్రాంకైటిస్, ఆస్తమా లాంటి లంగ్స్ డిసీస్ తో సుమారుగా 1,81,160 మంది మృతి చెందారని “రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా”( RGI) రిపోర్టు వెల్లడించింది.
టీబీ, క్యాన్సర్, డయేరియా : డయేరియా ,అతిసార వ్యాధిగా పిలుచుకునే ఈ వ్యాధితో ఐదేళ్ల కంటే తక్కువ వయసు గల పిల్లలు మరణాల బారిన పడుతున్నారు. భారతదేశంలో ప్రతి సంవత్సరం ఒక లక్షల మంది ఈ వ్యాధితో చనిపోతున్నారంటే దీని ప్రభావం ఎంతగా ఉందో మనం చూడొచ్చు. దీనితోపాటు 2020 ప్రపంచవ్యాప్తంగా మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ టీబీ కేసులు నమోదైన దేశాలలో మన భారతదేశం కూడా ఒకటి.
క్యాన్సర్ ఈ పేరును కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దీని బారిన పడి చాలా ప్రాణాలే గాల్లో కలిసిపోతున్నాయి. 2022 వరకు 8,08,558 దీని బారిన పడి ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ వ్యాధులు ఎందుకు సంభవిస్తున్నాయో, ఆహార అలవాట్లలో ఏమైనా మార్పులు జరగాలా, ఈ వ్యాధులకు కారణం ఏంటి అని ముందుగానే పసిగట్టి సరైన చికిత్స, సరైన సమయానికి తీసుకుంటే ప్రాణహాని లేకుండా బయటపడవచ్చు.