Health Tips : ఎండాకాలం అందరూ చల్లనీళ్లు తాగడానికి ఎక్కువగా ఇష్టపడతారు.అయితే ఈ నీళ్లకోసం ఫ్రిడ్జ్ వాడుతుంటారు.ఫ్రిడ్జ్ లో ప్లాసిక్ బాటిలలో నీళ్లు పోసి పెడుతుంటారు.ఇలా ప్లాస్టిక్ వాడకం ఆరోగ్యానికి ప్రమాదం. ఈ మధ్య కాలంలో ఆరోగ్యం కాపాడుకోవడం కొరకు చాలా మంది రాగి బాటిళ్లు,రాగి బిందెలు, రాగి గ్లాస్ లను ఎక్కువగా వాడుతున్నారు.
అయితే ఈ రాగి వస్తువులను ఫ్రిడ్జ్ లో పెట్టవచ్చా..దానివల్ల ఏమైనా నష్టాలు ఉన్నాయా ఇప్పుడు చూద్దాం. శతాబ్దాలుగా రాగి పాత్రలు వాడడం కొనసాగుతుంది. రాగికి సహజంగానే కనిపించే, శిలీంద్రాలు, సూక్ష్మజీవులు లాంటి క్రిములను నశింపజేసే గుణం ఉంటుంది. అందుకే రాగి పాత్రలో ఉన్న నీరు తాగితే మన ఆరోగ్యానికి చాలా మంచిది .

రాగి బాటిల్ ను ఫ్రిడ్జ్ లో అస్సలు ఉంచకూడదు. రాగి బాటిల్ ఫ్రిజ్ లో పెట్టడం వల్ల పెద్దగా నష్టాలు లేకపోయినా, ప్రయోజనాలు కూడా అస్సలు కలగవు. రాగి బాటిల్ ను గది లో ఉంచినప్పుడు మాత్రమే రాగి మూలకాలు నీటిలో కలిసిపోతాయి. ఫ్రిడ్జ్ లో పెడితే ఆల్కలీనైజేషన్ ప్రక్రియను అడ్డుకుంటాయి. అలాంటి రాగి పాత్రలో తాగే నీటికి ఎటువంటి ప్రయోజనం ఉండదు.
ఒకవేళ చల్లటి నీరు తాగాలనిపిస్తే, ఫ్రిడ్జ్ నీటిని రాగి పాత్రలో పోసి వాడుకోవచ్చు అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. రాత్రిపూట రాగీ పాత్రలో నీళ్లను నిల్వచేసి ఉంచి ఉదయాన్నే తాగడం ఆరోగ్యానికి మంచిది. 8 గంటలు రాగి పాత్రలో నీరు నిల్వ ఉంచితే అందులోని రాగి అయాన్లు ఆ నీటిలో కరిగిపోతాయి. ఈ ప్రక్రియను “ఒలిగో డైనమిక్ ఎఫెక్ట్” అని అంటారు.
