Health Tips : కాకరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. చేదుగా ఉంటుందని చాలామంది దీని దూరం పెడుతుంటారు కానీ కాకరకాయ వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి. ముఖ్యంగా మధుమేహంతో బాధపడే వారికి కాకరకాయ తినడం చాలా మంచిది. కాకరకాయలే కాకుండా కాకరకాయ రసము, దాని ఆకులు కూడా మందుగా చాలా ఉపయోగపడతాయి.
కాకర రసంలో ‘హైపోగ్లసమిక్ ” అనే పదార్ధం ఇన్సులిన్ స్థాయిలో తేడా రాకుండా నియంత్రిస్తూ, రక్తంలోని చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. కాకర గింజలు కూడా మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వాటి గింజల్లో ఉండే “చారన్‌టిన్ ” అనే ఇన్సులిన్ పదార్థం రక్తంలోని గ్లూకోజ్ ను తగ్గిస్తుంది.
అంతే కాదు కాకరకాయల్లో నీరు శాతం తక్కువగా ఉండి పౌష్టిక శక్తి ఎక్కువగా ఉండి, ఐరన్, జింక్, పొటాషియం, విటమిన్-సి, మాంగనీస్ వంటి పోషకాలను మన శరీరానికి అందిస్తుంది. మనిషి శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ లను తగ్గించి బరువును కంట్రోల్ లో ఉంచుతుంది. చిన్న పిల్లలు తినడానికి ఇష్ట పడరు,కానీ ఇంట్లో కనీసం వారానికి ఒక్కసారైనా కాకరకాయ తినేలా చూడాలి అని వైద్యులు సూచిస్తున్నారు.
కాకరకాయ తో పాటు తినకూడని పదార్థాలు కూడా ఉన్నాయి అవి ఏంటో తెలుసుకుందాం. బెండకాయ : కాకరకాయను, బెండకాయను కలిపి తినడం వల్ల పొట్టనొప్పి సమస్యలు వస్తాయి.
మామిడికాయలు : మామిడికాయలు, కాకరకాయ అస్సలు కలిపి తినొద్దు..బర్నింగ్ సెన్సేషన్, జీర్ణ సమస్య, ఎసిడిటీ, వికారంలాంటి సమస్యలు వస్తాయి.
పాలు : కాకరకాయ తిని వెంటనే పాలను తాగితే మలబద్ధకం, కడుపులో మంట వచ్చే అవకాశం ఉంది.
ముల్లంగి : ముల్లంగి,కాకరకాయ తినడం వల్ల గ్యాస్ సమస్యలు, కఫం సమస్య వస్తుంది.