Health Tips : మన రోజువారీ జీవితంలో “టీ” కి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఉదయం లేవగానే ఖచ్చితంగా “టీ” తాగాల్సిందే. ఈ అలవాటు చాలామందికి ఉంటుంది. ముఖ్యంగా భారతీయులలో ఈ అలవాటు ఎక్కువనే చెప్పాలి. “టీ” ఎక్కువగా తాగడం వల్ల నష్టాలు కూడా. ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువ.
టీ వల్ల దుష్పరిణామాలను తెలుసుకుందాం. “టీ” లో కెఫిన్ ఎక్కువగా ఉంటుంది. కడుపులో ఇన్ఫెక్షన్ తో ఇబ్బంది పడేవారు దీనిని ఎక్కువగా తాగడం మంచిది కాదు. టీ ఎక్కువ మోతాదులో తాగితే మన శరీరం సహజంగా గ్రహించే పోషకాలకు “టీ” ఆటంకం కలిగిస్తుంది. ఐరన్ లోపం ఉన్నవాళ్లు “టీ” కి దూరంగా ఉండటం మంచిది.
ఎందుకంటే “టీ” లో టానిన్లు ఎక్కువగా ఉంటాయి. అలాంటివారు ఎక్కువగా తాగితే వారి శరీరంలో ఒత్తిడి పెరిగిపోతుంది. ఆందోళన చేశారు. వీరు నిద్రలేమితో బాధపడతారు. “టీ” లో ఎక్కువ మోతాదులో కెఫిన్ ఉండటం వల్ల మైకం వచ్చే ప్రమాదం ఉంది.
అలాగే ఎముకలలోని పట్టుత్వం పోతుంది. కాబట్టి రోజులో ఒకటి నుంచి నాలుగు కప్పుల టీ తాగడం వల్ల ఎక్కువగా సమస్యలు రాకపోయినప్పటికీ, అంతకుమించి తాగితే మాత్రం ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.