Health Tips : భోజనం చేసేటప్పుడు నీళ్లు తాగడం అందరూ సర్వసాధారణంగా చేసేస్తుంటారు. తినేటప్పుడు నీళ్లు తాగకుండా తినడం కొందరి వల్ల అసలు సాధ్యం కానీ పనీ. మరికొందరు కనీసం ఒక రెండు గుటకల నీళ్లు అయినా తాగుతారు. అయితే ఇలా తాగడం ఆరోగ్యానికి మంచిదేనా? దానివల్ల ఏమైనా హాని జరుగుతుందా? అనేది ఇప్పుడు చూద్దాం.
ఆహారం తినేటప్పుడు నీళ్లు తాగడం హానికరం కాకపోయినప్పటికీ, అత్యధికంగా తాగడం మాత్రం జీర్ణక్రియ పైన వ్యతిరేక ప్రభావాన్ని చూపిస్తుంది. మరి నీళ్లు ఎప్పుడు? ఎలా తాగాలి?. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆహారం తీసుకునే 30 నిమిషాల ముందు, లేదా ఆహారం తీసుకున్న 30 నిమిషాల తర్వాత ఒక గ్లాసు నీరు తాగవచ్చు.
ఇలా చేస్తే జీర్ణ క్రియ జరిగే సమయంలో కడుపులో ఉన్న ఆసిడ్ మనం తినే ఆహారాన్ని విచ్చిన్నం చేయడంలో సహాయపడుతుంది. ఆహారంతో పాటుగా నీరు తాగితే మాత్రం అది మన కడుపులోని యాసిడ్ ని పొల్యూట్ చేసేస్తుంది. దీనివలన జీవ క్రియపై చాలా చెడు ప్రభావం ఏర్పడుతుంది. ఆహారం కడుపులో ఆమ్లం, ఎంజైములతో చాలా తక్కువ సమయం మాత్రమే సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి..
ఆహారం తినే టైంలో నీళ్లు తాగకపోవడం ఉత్తమం. చాలా అధ్యయనాల్లో వెళ్లడైన విషయం ఏంటంటే.. ఆహారము, నీరు రెండు కలిపి తీసుకున్నప్పుడు ఆ ప్రభావము జీర్ణక్రియ పై చాలా చెడు ప్రభావాన్ని చూపించిందని, అలాంటివారు ఎక్కువగా ఎసిడిటీ సమస్యను ఎదుర్కొన్నారని, అలా చేయడం ద్వారా బరువు కూడా పెరుగుతుందని ,శరీరంలోని ఇన్సులిన్ మొత్తాన్ని పెంచడానికి ఈ పద్ధతి దారితీస్తుందని తేలింది.