Health Tips : ఉదయం లేవగానే చాలామందికి కాఫీ తాగే అలవాటు ఉంటుంది. ఆరోగ్య నిపుణులు కాఫీ అధికంగా తాగడం ఆరోగ్యానికి ప్రమాదకరం అని సూచిస్తున్నారు. కాఫీ రుచి చేదుగా ఉంటుంది. అందువల్ల చక్కెరను ఎక్కువగా వాడుతుంటాం. దీనివల్ల శరీరంలో చక్కెర శాతం అధికమైపోయి అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.
చక్కెరలో ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఉబకాయం, మధుమేహం లాంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చదువుకునే విద్యార్థులు, వర్క్ లోడ్ ఎక్కువగా అనుభవించేవారు కాఫీని ఆశ్రయిస్తుంటారు. కానీ కాఫీలో ఉండే కెఫీన్ ఆరోగ్యానికి చాలా హానికారం. రాత్రి సమయాల్లో కాఫీ తాగడం వల్ల ఆ ప్రభావం నిద్రపైన పడుతుంది. సరిగా నిద్ర లేకపోవడం వల్ల చాలా సమస్యలు తలెత్తుతాయి.

అలాగే రాత్రి సమయాల్లో కాఫీని తీసుకోవడం వల్ల అసిడిటీ ,గ్యాస్ లాంటి పొట్ట సమస్యలు వస్తాయి.సమస్యలు తలెత్తుతాయి. కాఫీ గింజలను తయారు చేసేటప్పుడు వాటిపైన చాలా రకాల రసాయనాలు వాడుతారు. అవి ఎప్పుడు తాజాగా ఉండాలని ఈ విధానాన్ని పాటిస్తారు.
అలాంటి కాఫీ పొడిని మనం వాడడం వల్ల అది మన ఆరోగ్యం పైన తీవ్ర ప్రభావాన్ని చూపెట్టడం ద్వారా వాంతులు, వికారం లాంటి సమస్యలు కూడా తలెత్తుతాయి.