Health Tips : మన శరీర ఆరోగ్యం ఎలా ఉంది అనే విషయాన్ని మనం శరీరంలో కనిపించే మార్పులను బట్టి నిర్ధారించుకోవచ్చు వాటిలో ముఖ్యంగా గోర్లను చూసి మన ఆరోగ్యాన్ని అంచనా వేసుకోవచ్చు గోల్డ్ సహజంగా లేత గులాబీ రంగులో ఉంటాయి. వాటి ఆకృతిలో గానీ రంగులో గాని ఏదైనా మార్పు వస్తే వెంటనే మన ఆరోగ్య దెబ్బతింటుంది అనే విషయాన్ని గ్రహించాలి
గోళ్లు పాలిపోవడం : శరీరంలో గుండె, కిడ్నీ, రక్తహీనత, పోషకాహార లోపాలు, ఉన్నప్పుడు గోళ్లు పాలిపోయి తెల్లగా కనిపిస్తాయి. హెపటైటిస్ లాంటి కాలేయ సంబంధిత సమస్యలు ఉన్నా కూడా ఈ లక్షణాలు కనిపిస్తాయి. అప్పుడు జాగ్రత్త పడాలి.
పసుపు రంగు గోళ్లు : ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉండడంవల్ల గోర్లు ఆ కలర్ లోకి మారిపోతాయి. ఒకవేళ థైరాయిడ్ సమస్యలు, ఊపిరితిత్తుల సమస్య, షుగర్ వంటి ఉన్నా కూడా ఈ రంగులోకి మారే అవకాశం ఉంది.
నీలం రంగు గోళ్లు : మన శరీరానికి ఆక్సిజన్ సరిగా అందకపోతే మన గోర్లు నీల రంగులోకి మారిపోతాయి. అప్పుడు ఊపిరితిత్తులు, గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి.
విరిగిన గోళ్లు : గోళ్లు పేలుసుగా మారి పొరలు పొరలుగా విరిగి పోతూ ఉంటాయి. అలాంటప్పుడు థైరాయిడ్ సమస్యలు వస్తాయి.
గొళ్లా పై తెల్లటి మచ్చలు : శరీరంలో పోషకాహార లోపం కాల్షియం వంటివి లోపిస్తే అలాగే ఐరన్ లోపం వంటివి ఉంటే గోళ్లు నిదానంగా పెరగకుండా తెల్లటి మచ్చలు ఏర్పడతాయి. అలాంటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి.