Healthy Hair Tips : ఈరోజుల్లో ఎక్కువ మందికి జుట్టు రాలడం పెద్ద సమస్యగా తయారయింది. జుట్టు రాలడం తగ్గించడానికి ఎన్నో రకాల షాంపులను, అయిల్స్ ను వాడుతూ ఉంటారు. కానీ వాటి వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండకపోగా, జుట్టు సమస్య ఇంకా అధికమవుతుంది. జుట్టు రాలడం ఆపడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం.
జుట్టు రాలడం సమస్య అనేది ఆహారంతో ముడిపడి ఉంటుంది. మనం తీసుకునే డైట్ సక్రమంగా ఉంటే జుట్టు సమస్య ఉండదు. మనం తీసుకునే ఆహారంలో సమతుల్యతల లోపంతో జుట్టు రాలడం అనేది మొదలవుతుంది. సరైనా ఆహారం తీసుకోకపోతే దాని ప్రభావం మెదడు ఇతర శరీర భాగాలపైన పడుతుంది. దానివల్ల జుట్టు సమస్య వస్తుంది.
జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి?ఆరోగ్యకరమైన జుట్టును పొందాలి అని అంటే విటమిన్లు, సూక్ష్మపోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఆకుకూరలు, చేపలు గుడ్లు, గింజలు పప్పులు వంటి ఆహార ధాన్యాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కూడా జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. వీటితోపాటు ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం ఉత్తమం.
రసాయనాలు ఎక్కువగా ఉన్న ఆహారానికి బదులుగా ఆర్గానిక్ లేదా నేచురల్ ఫుడ్ ను తీసుకోవడం జుట్టుకే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు. ఇడ్లీ ,పెరుగన్నం, మజ్జిగ లాంటి ప్రోబయోటిక్ అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. విటమిన్ కె పుష్కలంగా దొరికే చేపలను తినడం వల్ల కూడా జుట్టు సమస్యకు చెక్ పెట్టవచ్చు. చికెన్, మటన్ చాలా ఇష్టంగా తింటూ ఉంటారు.
అయితే వాటిని నూనెలో వేయించినవి తినకూడదు. వాటి వల్ల కొలెస్ట్రాల్ పెరిగి జుట్టు ఊడిపోయే సమస్య అధికమవుతుంది. ఆహారంతోపాటు జుట్టును శుభ్రంగా ఉంచుకోవడం చాలా అవసరం. రసాయనాలు కలిగిన షాంపూలను వాడడం తగ్గించి కుంకుడుకాయ, షికాయ వంటి సహజమైన వాటిని వాడడం మంచిది.
.