Heart Pain : 45 ఏళ్లు దాటిన తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే గుండెపోటు భారీ నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు అని వైద్యులు చెబుతున్నారు. 45 ఏళ్ల ముందు ఆరోగ్య స్థితి, 45 సంవత్సరాల తర్వాత ఉండే ఆరోగ్య స్థితి వేరు. కాబట్టి రోజువారి ఆహార నియమాలలో కొన్ని మార్పులు చేస్తే సరిపోతుంది. మన ఎలాంటి ఆహారం తీసుకుంటే అలాంటి ఆరోగ్యం స్థితిని పొందగలం. గుండెను పదిలంగా ఉంచుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాం.
ధూమపానం : ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని వైద్యులు హెచ్చరిస్తుంటారు. గుండెపోటుకి ధూమపానం ప్రధమ కారణంగా నిలుస్తుంది. హానికరమైన పొగాకు, సిగరెట్ వంటి తాగడం వలన గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువ అని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
వ్యాయామం : ప్రతిరోజు గంట నడక ఆరోగ్యానికి మేలు చేస్తుందని నిపుణులు సలహా ఇస్తూనే ఉంటారు. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజు 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. దానివల్ల శరీరంలో ఉండే హై బీపీ అదుపులో ఉండి కొలెస్ట్రాల్, మధుమేహం వంటివి మనకు వ్యాపించకుండా ఉంటాయి.
ఒత్తిడి : చాలావరకు అందరూ ఒత్తిడికి గురవుతూనే ఉంటారు. రోజువారి జీవితంలో ఉండే అనేక పనుల వల్ల, సమస్యల వల్ల ప్రతి మనిషి ఒత్తిడిని ఫీల్ అవుతారు. దీనిని తగ్గించుకోవడానికి మద్యపానం, ధూమపానం లాంటి వాటి జోలికి వెళ్లకుండా ధ్యానాన్ని, యోగానీ మీ జీవితంలో చేర్చుకోవాలి. అప్పుడు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చు.
నిద్ర : సంపూర్ణ ఆరోగ్యానికి, సంపూర్ణ నిద్ర చాలా అవసరం. ప్రతి మనిషిని కనీసం రోజుల్లో 8 గంటలు నిద్రపోవాలి. నిద్ర సరిగా లేకపోతే ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. నిద్రలేమితో హై బీపీ, డయాబెటిస్ లాంటి సమస్యలు మన శరీరంలో వచ్చి చేరుతాయి.