High Fat Food : ఈరోజుల్లో చాలామంది బరువు సమస్యతో తమకు ఇష్టమైన ఆహారాన్ని దూరం పెడుతూ ఉంటారు. ముఖ్యంగా వాటిల్లో బిర్యాని, హై ఫాట్ ఉన్నటువంటి ఆహారం. అయితే శరీరంలో విటమిన్స్ జీర్ణం కావాలంటే కొవ్వు కూడా చాలా అవసరమని మీకు తెలుసా..? శరీరంలో ఉండే విటమిన్లు A,E,D,K కొలెస్ట్రాల్స్ లల్లో మాత్రమే కరుగుతాయాని చాలామందికి తెలియదు.
కాబట్టి శరీరానికి కొలెస్ట్రాల్ తగిన పరిమాణంలో కావాల్సిందే.. మరి శరీరానికి కావలసిన కొవ్వు లభించాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..మన ఇంట్లో ఉండే ఆహార పదార్థాల్లోనే ఈ కొవ్వు మనకు పుష్కలంగా లభిస్తుంది. అవేంటంటే..
★ అవోకాడో : ఒకవేళ మీ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న ఆహారాలకు మీరు దూరంగా ఉన్నట్లయితే, ఈ అవకాడోను కచ్చితంగా మీ ఆహారంలో చేర్చుకోండి. ఇది చెడు కొలెస్ట్రాల్ నీ తగ్గించేందుకు చాలా బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా గుండెను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది.
★ ఆలివ్ ఆయిల్ : చాలామంది వేయించిన ఆహారాలను అస్సలు తినరు. అలాంటివారు ఆలివ్ ఆయిల్ వినియోగిస్తే దాంట్లో ఉండే పోషకాలు మోనోశాచురేటెడ్ కొవ్వులు గుండెను ఆరోగ్యంగా చేసేందుకు ఉపయోగపడతాయి. శరీర బరువును కూడా నియంత్రించేందుకు మీకు సహాయపడతాయి.
★ పెరుగు : బరువు తగ్గడానికి మనం తీసుకునే ఆహారాలు మన శరీరాన్ని, ఆరోగ్యాన్ని సమతుల్యం చేస్తాయి. కాబట్టి శరీరం ఆరోగ్యంగా ఉండడానికి తప్పకుండా పెరుగును తినడం చాలా మంచిదని వైద్యులు సూచిస్తారు. పెరుగులో ఉండే గుణాలు ప్రేగులను కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి.
★ కొబ్బరి : చాలామంది కొబ్బరిని తినడం ఇష్టపడతారు. కానీ కొబ్బరి నూనె వాడడానికి ఇష్టపడరు. కానీ ఈ రెండు తీసుకోవడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది. వీటి ద్వారా చాలా రకాల పోషక గుణాలు లభిస్తాయి. వీటి కారణంగా శరవేగంగా ట్రైగ్లిజరైడ్ ఫుడ్ సులభంగా జీర్ణమవుతుంది. అంతేకాకుండా పోట్ట సమస్యలు, మలబద్ధక సమస్య నుంచి కూడా ఉపశమనం దొరుకుతుంది.