Hindu Tradition : హిందూ సంప్రదాయాల ప్రకారం కొన్ని వస్తువులను దానం చేయకూడదు అంటారు. అలాగే ఇంకొన్ని వస్తువులను సమయం, సందర్భం లేకుండా తాకరాదు అని అంటారు. మరి కొన్ని వస్తువులను ఒకరి చేతిలో నుంచి ఇంకొకరికి చేతిలోకి ఇవ్వకూడదు అని అంటుంటారు. ఇవన్నీ కూడా మానవ శ్రేయస్సు కోసమే శాస్త్రాలలో లిఖించబడి ఉన్నాయి. ఏ వస్తువులను ఒకరి చేతిలో నుండి డైరెక్ట్ గా ఇంకొకరి చేతికి ఇవ్వకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
చీపురు : హిందూ సంప్రదాయ ప్రకారం చీపురుకు కూడా చాలా ప్రత్యేకత ఉంది. మన పెద్దవాళ్లు చీపురును కాళ్లతో తొక్కితే అరిష్టమని చెబుతుంటారు. అలాగే చీపురు ఇష్టం ఉన్న దిశలో కూడా పెట్టకూడదు. అలాగే చీపురును ఒకరి చేతిలో నుంచి మరొకరు అస్సలు తీసుకోకూడదు. దీనివల్ల వారి స్నేహం చెడటమే కాక..
వారి మధ్య శత్రుత్వం పెరుగుతుంది. ఇంటి ఆడపడుచులు పుట్టింటి నుంచి చీపురు అసలు మెట్టినింటికి తీసుకు పోకూడదు. దానివల్ల పుట్టింటికి, మెట్టినింటికి మధ్య గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని శాస్త్రాలు చెబుతున్నాయి.
ఉప్పు : ఉప్పు అనగానే మనకు దిష్టి తీయడమే గుర్తుకు వస్తుంది. ఉప్పును ఎక్కువ శాతం దిష్టి కోసం వినియోగిస్తూ ఉంటారు. అలాగే ఉప్పుకు మన సాంప్రదాయాలలో ప్రత్యేక స్థానం ఉంది. చాలా పూజా కార్యక్రమాలలో కూడా ఉప్పును ప్రత్యేకంగా వాడుతుంటారు.
అయితే ఇలాంటి ఉప్పును ఒకరి చేతిలో నుంచి ఒకరు డైరెక్ట్ గా తీసుకుంటే మాత్రం వారి మధ్య గొడవలు జరగడం ఖాయం. అంతేకాకుండా ఆర్థిక ఇబ్బందులు కూడా వారు చవిచూడవలసి వస్తుంది. అలాగే ఉప్పును అరచేతిలో కూడా వేయకూడదు. అలా చేస్తే ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు.. అని శాస్త్రాలు చెబుతున్నాయి.
చింతపండు : హిందూ సంప్రదాయం ప్రకారం లక్ష్మీదేవి చింతపండును లక్ష్మీదేవికి ప్రతిరూపకంగా చూస్తారు. చింతపండును ఒకటి చేతిలో నుంచి ఇంకొకరు నేరుగా తీసుకోకూడదు దానివల్ల ఇంట్లో అశాంతి ఆర్థిక తగాదాలు నెలకొనే అవకాశాలు ఎక్కువ అలాగే చింతపండు ఎప్పటికీ ఇంట్లో నిల్వ ఉండేలాగా చూసుకోవాలి.