Immunity Boosting Food to Fight Corona : కరోన వైరస్ మళ్లీ విజృంభిస్తుంది. రోజుకు రోజుకి కేసులు పెరుగుతున్నాయి. మళ్లీ మాస్కులు తప్పనిసరిగా పెట్టుకోవాలని ఆరోగ్య శాఖ వారు హెచ్చరిస్తున్నారు. ఇదివరకే కరోనా ప్రపంచాన్ని గడగడలాడించింది. మరో మారు తన పంజా విసరడానికి రెడీగా ఉంది. హైదరాబాద్ లో కూడా ప్రెసెంట్ ఒక కేసు అయిందని చెప్పి సమాచారం. అయితే ఈ కరోనా నుంచి బయటపడడానికి ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి.
ఎలాంటి ఆహారం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇప్పుడు తెలుసుకుందాం.. కరోనాను మన శరీరం తట్టుకునేందుకు ఆకుకూరలు చాలా బాగా పనిచేస్తాయి. పాలకూర తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థకు శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ వ్యవస్థకు డ్రై ఫ్రూట్స్, నట్స్ ముఖ్యమైనవి. అల్లం, వెల్లుల్లి ఆహారంలో భాగం చేసుకోవాలి.
పసుపు, మిరియాలు, లవంగాలు, యాలకులు వంటి సుగంధ ద్రవ్యాలు కూడా రోగనిరోధక శక్తిని పెంచడంలో చాలా బాగా పనిచేస్తాయి. అలాగే వీటితోపాటు పాల ఉత్పత్తులను కూడా కచ్చితంగా తీసుకోవాలి. పాలలో ఉండే పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇంకా చెప్పాలంటే పుట్టగొడుగులు, చేపలు, గుడ్లు, మాంసం తింటే రోగనిరోధ వ్యవస్థకు బలాన్ని చేకూర్చినట్టు అవుతుంది.