ఏదైనా బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థ నుంచి లోన్ లేదా క్రెడిట్ కార్డ్ తీసుకోవాలన్నా.. వ్యక్తిగత రుణం తీసుకోవాలన్నా ముందుగా మీ CIBIL స్కోర్ ఎంత..? అని అడుగుతారు. అందుకే సిబిల్ స్కోర్‌ను మంచిగా చూసుకోవాలని ఆర్ధిక నిపుణులు సూచిస్తుంటారు. లోన్ తీసుకుంటే.. బ్యాంకు ఎంత వడ్డీకి రుణం ఇస్తుంది.. అనేది మీ సిబిల్ స్కోర్‌పై ఆధారపడి ఉంటుంది. మీ CIBIL స్కోర్ ఎంత మెరుగ్గా ఉంటే, అంత సులభంగా తక్కువ వడ్డీ రేటుకు రుణం పొందవచ్చు. సిబిల్ స్కోర్‌లో మీ ఉద్యోగ వివరాలు, బ్యాంక్ ఖాతాలు, పాత రుణ వివరాలు వంటి మీ వ్యక్తిగత సమాచారం మొత్తం ఉంటుంది.
ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా ఈ రోజుల్లో ఈ స్కోర్‌ను చూస్తున్నాయి. సిబిల్ స్కోర్ 300 నుంచి 900 వరకు ఉంటుంది. సాధారణంగా 700 కంటే ఎక్కువ CIBIL స్కోర్ మంచిగా పరిగణిస్తారు. ఇక మనం క్రెడిట్ స్కోర్ ని ఎలా మెరుగుపరుచుకోవాలి..? ఎలాంటి తప్పులు చేయకూడదు వంటి విషయాలని చూద్దాం. క్రెడిట్ కార్డు వున్నవాళ్లు పరిమితిని జాగ్రత్తగా చూసుకోవాలి. లిమిట్ దాటి వాడకూడదు. క్రెడిట్ పరిమితిలో 30% కంటే ఎక్కువ రుణం తీసుకోకూడదు. సిబిల్ స్కోర్ బాగుండాలంటే సకాలంలో లోన్ ని కడుతూ ఉండాలి.
క్రెడిట్ కార్డ్ పరిమితిని గమనించడం కూడా ముఖ్యం. అందులో 30 శాతానికి మించి ఖర్చు చేయరాదు. అసురక్షిత లోన్స్ తీసుకోవడం వలన మీ సిబిల్ స్కోర్ ఎఫెక్ట్ అవుతుంది. కొలేటరల్‌ను అందించడం వల్ల ఆర్థిక సంస్థలకు నమ్మకం వస్తుంది. తెలీకుండా లోన్ ఏమైనా మంజూరు చేసారా అనేది చూడాలి. మోసపూరిత లావాదేవీలు జరగవచ్చు కాబట్టి చూసుకుంటూ ఉండడం మంచిది. ఏడాదికి ఓసారి ఏదైనా క్రెడిట్ బ్యూరో నుండి క్రెడిట్ నివేదికలను ఫ్రీగా తీసుకోవచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది.
