Interesting Facts About Hunza Valley : 150 ఏళ్ళు జీవించి ..60 ఏళ్ల వయసులో కూడా యవ్వనంగా కనిపించే మనుషులను మీరు ఎప్పుడైనా చూసారా.. పోనీ 90 ఏళ్లలో కూడా తల్లులయే మహిళల నైనా చూసారా.. ఈ రెండు విచిత్రంగానే ఉన్నాయి కదా ! కానీ ఇలాంటి వాళ్లు కూడా మనకు దగ్గరలోనే ఉన్నారు. ఆ వింతైన ఊరు పాకిస్తాన్ లో ఉంది. అందమైన పర్వతాల సముదాయంలో అదో అద్భుతమైన లోయా.. దాని పేరే..” హుంజా కమ్యూనిటీ”.
ఈ హుంజా కమ్యూనిటీ లోనే ఆ అద్భుతమైన ప్రజలు నివాసం ఉండేది. ఈ హుంజా లోని ప్రజలు 150 సంవత్సరాలు జీవిస్తారు. వినడానికి ఎంతో ఆశ్చర్యంగా ఉంది కదా.. కానీ వీళ్లు అలా జీవించడానికి పాటించే కొన్ని ఆరోగ్య సూత్రాలు అందుకు కారణం.. భౌతికంగానే ఇక్కడ ప్రజలు చాలా బలవంతులు. ఇప్పటివరకు వాళ్లు ఆరోగ్య సమస్యలతో హాస్పిటల్ వెళ్లిన రోజులే లేవు.
వీళ్లు అతిగా ఆహారం తీసుకోరు. మాంసాహారాన్ని కూడా తక్కువ మోతాదులోనే తీసుకుంటారు. వీళ్ళకి సైకిల్ గాని ఏ ఇతర వాహనాలు కానీ అసలు తెలియదు. వీళ్లు కాలి నడకనే అన్ని పనులు చేసుకుంటారు. ఉదయం నాలుగు గంటలకే నిద్రలేస్తారు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం కూడా హుంజాలో దాగి ఉంది. అక్కడి మహిళలు 90 ఏళ్లకు కూడా గర్భవతులు కాగలుగుతారు.
ఇంకా అక్కడి స్త్రీలు 60, 70 సంవత్సరాలు ఉన్నా కూడా చాలా యవ్వనంగా 25 సంవత్సరాల వాళ్ల లాగా కనిపిస్తారు.ఎంతో అద్భుతమైన అందం అక్కడి మహిళల సొంతం. ఈ కమ్యూనిటీలోని ప్రజలు చాలా విద్యావంతులు కూడా.. ఆ కమ్యూనిటీలోని వ్యాలీ లో మొత్తము 85 వేలకు పైగా జనాభా నివసిస్తారు. వీళ్ళు ముస్లిం మతాన్ని ఆచరిస్తారు.హుంజా కమ్యూనిటీ ప్రజలకు మరో పేరు ‘బురుషో’. వీళ్ళ ప్రధాన భాష ‘బురుషాస్కీ’.
ఈ కమ్యూనిటీ గురించి, వీరి జీవన విధానం గురించి పుస్తకాల్లో కూడా రచించడం ఇంకో ఆశ్చర్యపరిచే విషయం. ‘ది హెల్తీ హుంజాజ్’ మరియు ‘ది లాస్ట్ కింగ్‌డమ్ ఆఫ్ ది హిమాలయాస్’ లాంటి పుస్తకాలు హుంజా ప్రజలను మనకు పరిచయం చేస్తాయి. ఈ అందాల అద్భుతాలను చూడడానికి ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులు వస్తుంటారు. అటు వైపు వెళ్ళినప్పుడు.. మీరు ఆ అద్భుతాలను ఆస్వాదించండి..