Interesting Facts About ThrilokiBigha : ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అని ఒక నానుడి ఉంది. కానీ ఆ గ్రామంలో కనుక ఉల్లిపాయ, వెల్లుల్లి పేరు మాట్లాడామో, ఇక మనకు దేహశుద్ధి తప్పదు. అసలు ఉల్లిపాయ లేకుండా కూరను తలుచుకోలేము , ఉల్లిపాయ ఎంత రేటు ఉన్నా కూడా ఖచ్చితంగా దాన్ని కూరలో వాడతాము. కానీ అసలు ఉల్లిపాయ రుచి తెలియని గ్రామం అది.
ఉల్లిని, వెల్లుల్లిని వాడడం వల్ల ఆనారోగ్య సమస్యలు రావు. సీజనల్ వ్యాధుల నుంచి కూడా కాపాడతాయి. వీటి వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నా కూడా ఓ గ్రామంలో మాత్రం అస్సలు వాటిని వాడరు. గత 45 ఏళ్లుగా ఓ గ్రామ ప్రజలు వెల్లుల్లి, ఉల్లిపాయలను అస్సలు వాడరు. అసలు ఆ గ్రామం ఎక్కడ ఉంది, ఎందుకు వాటిని వాడరు, దానికి గల కారణాలు ఇప్పుడు తెలుసుకుందాం..
బిహార్‌లోని జెహనాబాద్ జిల్లాలోని చిరి పంచాయతీ పరిధిలో “త్రిలోకి బిఘ” అనే గ్రామం ఉంది. ఇక్కడ 45 సంవత్సరాలుగా ఉల్లి, వెల్లుల్లిపాయను వాడరు. ఈ గ్రామంలో చాలా పురాతనమైన ఠాకూర్‌బడి అనే ఆలయం ఉంది. ఉల్లి, వెల్లులి తిని ఈ ఆలయంలో ఉండే దేవుణ్ణి పూజించడం అక్కడ నేరం.
ఒకవేళ ఎవరైనా వాడితే మాత్రం ఆ గ్రామంలో, వారి ఇళ్లలో చెడు జరుగుతుందని, ఏవైనా ప్రమాదాలు జరుగుతాయని వారి నమ్మకం. అందుకే ఇక్కడి ప్రజలంతా ఉల్లి, వెల్లుల్లి లేకుండా ఆహారం తీసుకుంటారు. ఆ ప్రజలు ఈ సంప్రదాయాన్ని చాలా కాలంగా పాటిస్తున్నారని, త్రిలోకి బిఘా గ్రామ పెద్దలు తెలిపారు. ఈ గ్రామంలో వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు మాత్రమే కాదు, మాంసం, మద్యం కూడా నిషేధం.