Interesting Facts : చలికాలంలో ఉష్ణోగ్రత తక్కువస్థాయికి చేరినప్పుడు కొన్ని ప్రాంతాల్లో నదులు మరియు చెరువుల్లోని నీరు గడ్డకట్టుకుపోతుంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే.. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే.. గడ్డ కట్టుకున్న నీళ్లు మళ్ళీ యథాస్థితిలోకి వచ్చాక చూస్తే.. ఆ నీటిలో ఉన్న జీవులు సజీవంగా మనకు కనిపిస్తాయి. అంత గడ్డ కట్టిన నీటిలో ఉండటం వల్ల ఈ జీవులు కూడా గడ్డకట్టుకొని చనిపోవాలి కదా..

ఎలా ప్రాణంతో ఉన్నాయా.. అని మనకు డౌట్ వస్తుంది కదా..!? నిజానికి చెరువులు మరియు నదులలో నీళ్లు గడ్డ కట్టినప్పుడు నీటిపై భాగం మాత్రమే గడ్డ కడుతుంది. అలా గడ్డ కట్టిన నీరు మొత్తం ఒక పొరలాగా మాత్రమే ఉంటుంది. ఆ పొర కింద ఉండే నీళ్లు మాత్రం అలాగే ఉంటాయి.
మనకు సరస్సుల్లో, నదుల్లో కనిపించే నీళ్లు మొత్తం గడ్డకట్టవని.. అవి ఒక క్రమపద్ధతిలో మాత్రమే ఘనీభవిస్తాయని అర్థం. నీటి పైన ఘనీభవించిన నీరు, కింద ఉన్న నీటిని మరీ చల్లగా కాకుండా కాపాడుతూ ఉంటుంది. అలా కింద ఉన్న నీటిలో ఆక్సిజన్ ఉంటుంది. ఆ ఆక్సిజన్ కలిగి ఉన్న నీటిలో ప్రాణులు జీవించడం ద్వారా ఎటువంటి ప్రమాదానికి గురి కాకుండా ఉంటాయి.
