Interesting Facts : ఈ భూమ్మీద అంత చిక్కని అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. కొన్ని అద్భుతాలు అయితే శాస్త్రవేత్తలను కూడా విస్తుపోయేలా చేస్తాయి. శాస్త్రవేత్తలు ఇంకా ఆ రహస్యాన్నీ ఛేదించని ఒక ఫ్యాక్ట్ గురించి మనం కూడా తెలుసుకుందాం.. ఒక్క సముద్రాన్నే మనం మొదలు చూస్తే చివర చూడలేము. అలాంటిది రెండు సముద్రాలు ఒకే చోట కలిసే ఆ సంగమం చూసేందుకు రెండు కళ్ళు సరిపోవు.
సముద్రాలు నిజంగా ఇలా కలుస్తాయా అని మీరు అనుకుంటున్నారా.. అలాంటి సముద్రం ఎక్కడ ఉందో ఇప్పుడు చూద్దాం.. ఈ రెండు సముద్రాలు కలిసే చోటు
‘గల్ఫ్ అలెక్స్’ అనే ప్రాంతం. ఇక్కడ రెండు సముద్రాలు కలుస్తాయి. అయితే ఇక్కడ వింత ఏముంది అనే కదా మీ డౌట్.. ఇక్కడ రెండు సముద్రాలు కలుస్తాయి కానీ ఆ రెండిట్లో ఉన్న నీళ్లు మాత్రం కలవవు.
ఇదేంటని ఆశ్చర్యపోతున్నారా..!?
ఒకవైపు హిందూ మహాసముద్రం, మరోవైపు పసిఫిక్ మహాసముద్రం రెండు కలిసినట్లే కనిపిస్తాయి. కానీ ఈ రెండింటి మధ్య ఒక బార్డర్ లైన్ కనిపిస్తుంది. మనం మామూలుగా చూసినట్లయితే నీళ్లు ఏ నీటితో అయినా కలిసిపోతాయి. కానీ ఇక్కడ మాత్రం అలా జరగదు.
ఒక సముద్రంలోని నీరు లేత నీలం రంగులో ఉంటే మరో సముద్రంలోని నీరు ముదురు నీలం రంగులో ఉంటుంది. ఈ రెండు సముద్రాలు కలిసే చోట తెల్లటి నురగ అనేది అడ్డుగోడగా వస్తుంది. ఇలా ఈ రెండు సముద్రాల మధ్య విభజన రేఖ అనేది స్పష్టంగా మనకు కనిపిస్తుంది. అయితే ఇలా ఎందుకు జరుగుతుంది అనే విషయం మీద శాస్త్రవేత్తలు ఇంకా పరిశోధన చేస్తూనే ఉన్నారు.
Discussion about this post