Interesting Facts : ప్రపంచంలో ఉన్న కార్ల తయారీ బ్రాండ్లన్నీ ఒకెత్తు అయితే.. రోల్స్ రాయిస్ మాత్రం మరో ఎత్తు. ఇవి కేవలం ఎక్స్‌క్లూజివ్ కార్లు మాత్రమే కాదు. ఎంతో ఖరీదైన కార్లు కూడా అలాంటి కార్ ని మొదటి ప్రపంచ యుద్ధం జరగడానికి (1914-1918) ముందు ఆ కంపెనీ 20 వేలకు పైగా కార్లను ఉత్పత్తి చేసింది. అందులో 20% కార్లు ఇండియాకే దిగుమతి చేయబడ్డాయి.
అప్పట్లో దేశంలో సగటున 2000 రోల్స్ రాయిస్ కార్లు ఉండేవి. మన ఇండియాలో 230 మంది మహారాజులు ఆ కాలంలో ఉన్నారు. ఆ రోజుల్లో మన భారత రాజులకు, రోల్స్ రాయిస్ కి మధ్య అవినాభావ అనుబంధం ఉండేది. రాజస్థాన్‌లోని అల్వార్ కు చెందిన ప్రముఖ మహారాజు “జై సింగ్” ఒకేసారి మూడు ఆటోమొబైల్స్ కొనుగోలు చేసాడు.
దాని వెనుక పెద్ద కథే ఉంది..
1920లో ఒకరోజు ఆల్వార్ మహారాజు అయిన
జై సింగ్ మాములు బట్టలు వేసుకొని లండన్ మేఫెయిర్ ఏరియా వీధుల్లో తిరుగుతున్నప్పుడు అతనికి రాయిస్ షోరూమ్ కనిపించడంతో ఆ షాప్ లోకి వెళ్ళాడు. అప్పుడు ఒక బ్రిటీష్ సేల్స్‌మాన్ మాములు వస్త్రధారణలో ఉన్న మహారాజు జై సింగ్‌ను చూసి అతను రాజు అని తెలీక నిర్లక్ష్యంగా ప్రవర్తించాడు.
కింగ్ జై సింగ్ కి దాన్ని అవమానంగా భావించి.. దాన్ని తట్టుకోలేక వెంటనే అక్కడి నుంచి తన హోటల్ గదికి తిరిగి వెళ్ళాడు. అనంతరం తన సేవకులతో రోల్స్ రాయిస్ షోరూమ్‌కి కాల్ చేయించి, అల్వార్ నగర రాజు వారి కార్లలో కొన్నింటిని కొనుగోలు చేస్తున్నట్టు ఆ కంపెనీ యజమానులకు వార్త పంపించాడు.
ఆ వార్త వినగానే కంపెనీ యజమానులు చాలా సంతోషంగా రాజు దర్శనం కోసం షాప్ ముందు సేల్స్ మేన్స్ అందరూ రెడ్ కార్పెట్ పరిచి మరీ రాజు రాక కోసం వెయిట్ చేస్తున్నారు. అప్పుడు రాజు తన రాజ రూపంలో షోరూమ్‌ని సందర్శించాడు. ఆ సమయంలో షోరూమ్‌లో ఆరు కార్లు ఉంటే, రాజు ఒకేసారి 6 కార్లను కొనుగోలు చేశాడు. డెలివరీ ఛార్జీలతో సహా మొత్తాన్ని వెంటనే చెల్లించేసాడు.
6 రోల్స్ రాయిస్ ని రాజు కొనుగోలు చేసాడు. తర్వాత వాటిని భారతదేశానికి దిగుమతి చేశాక ఆ కార్లను రాజు వాడుకోకుండా, భారత దేశంలోని వీధులలో ఊడ్చేందుకు ఈ కార్లను వాడాలని మున్సిపాలిటీ వాళ్లకు హుకుం జారీ చేసాడు.
అప్పటికే వరల్డ్ నెంబర్ వన్ సంస్థగా ఉన్న రోల్స్ రాయిస్ సంస్థ ఈ వార్త విని చాలా షాక్ అయ్యింది. ఇంత పెద్ద కంపెనీ నుండి తీసుకెళ్లిన అంత ఖరీదైన కార్లను, భారతదేశంలో అలా మున్సిపాలిటీ వాహనాలుగా అలా ఎందుకు వినియోగిస్తున్నారని వాళ్ళు షాక్ అవుతారు.
ఈ వార్త నలుదిశల వ్యాపించగానే రోల్స్ రాయిస్ గుడ్ విల్ తగ్గిపోయింది. రోల్స్ రాయిస్ వారి ప్రవర్తనకు క్షమాపణలు చెబుతూ భారత రాజు జై సింగ్‌కు టెలిగ్రామ్ పంపించి, మరో ఆరు సరికొత్త కార్లను కూడా ఉచితంగా అందించింది. ఆ కంపెనీ పశ్చాత్తాపం చూసిన రాజు చెత్తను సేకరించడానికి రోల్స్ రాయిస్‌ను ఉపయోగించడం మానేయాలని మున్సిపాలిటీని ఆదేశిస్తాడు. మొత్తానికి ఇండియన్ కింగ్ దెబ్బకు.. రోల్స్ రాయిస్ దిగొచ్చిందన్న మాట!