Interesting Facts : చెట్లు ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయని మీకు తెలుసా.. అయితే మనుషులు మాట్లాడుకున్నట్టుగా కాకుండా.. చెట్లు వేర్ల ద్వారా ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ చేసుకుంటాయి. మనకు ఎలా అయితే ఇంటర్నెట్ ఉందో చెట్ల కూడా ఫంగస్ తో ఏర్పడే ఒక న్యాచురల్ కమ్యూనికేషన్ ఉంటుంది. దీనిని “మైసిలియం” అంటారు. మనం వాడే ఇంటర్నెట్ ని world wide web అని ఎలా పిలుస్తారో.. అలాగే చెట్లు వాడే ఇంటర్నెట్ ని wood wide web పిలుస్తారు.
వీటి ద్వారా ఒక చెట్టు నుండి మరో చెట్టుకు సిగ్నల్ అండ్ న్యూ ట్రియల్స్ అందుతాయి. అలాగే పెద్ద, పెద్ద చెట్లు వాటి పిల్లలతో అంటే వాటి విత్తనాల ద్వారా గాని, వాటి మొక్కల ద్వారా కానీ వచ్చే పిల్లలను గుర్తించగలవు. మనుషులు పిల్లలతో ఎలా అయితే ప్రేమగా కమ్యూనికేట్ అవుతారో, అలాగే చెట్లు కూడా వాటి పిల్లలను అంతే ప్రేమగా చూసుకుంటాయి. అని ఒక ఎక్స్పరిమెంట్ లో తేలింది. దాన్ని నిరూపించడానికి ఒకచోట చిన్న ప్రయోగం చేశారు.
ఒక తల్లి చెట్టు దగ్గర వేరే జాతికి చెందిన విత్తనాలను నాటారు. ఆ పక్కనే ఆ చెట్టు జాతికి చెందిన విత్తనాలు నాటారు. అయితే ఆ తల్లి చెట్టు తన పిల్ల మొక్కలకు మాత్రమే కనెక్ట్ అయ్యింది. అంతేకాకుండా ఆ పిల్ల మొక్కలకు కావలసిన నీరు, నైట్రోజన్, కార్బన్ ,ఫాస్ఫరస్ ను వేళ్ళ ద్వారా అందించింది. ఐసోటోవ్ ట్రెజర్ ద్వారా మానిటర్ చేసినప్పుడు మొక్కలు ఈ పోషకాలను పంపుతున్నట్టు సైంటిస్టులు గుర్తించారు.
అంతేకాదు పిల్ల మొక్కలకు కాంపిటీషన్ గా ఉండాకూడదని తల్లి మొక్క తన వేళ్ళను అటువైపు వెళ్ళకుండా చూస్తుంది. అలా చేయడం వల్ల చుట్టుపక్కల ఉన్న పోషకాలన్నీ ఆ పిల్ల మొక్కలకు అందుతాయి. తల్లి మొక్కకు ఏదైనా చీడ, పీడలు తగిలి చనిపోయేటట్టు ఉంటే ,వెంటనే తన పిల్ల మొక్కల వైపు ఆ చీడ, పీడలు వెళ్లకుండా చేస్తుంది. తన దగ్గర ఉన్న రిసోర్సెస్ మొత్తం ఆ పిల్ల చెట్లకు పంపిస్తుంది. ఇలా ఈ విధంగా భూమి లోపల మనకు తెలియని ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి.
Discussion about this post