Interesting Facts : ఏడిస్తే.. కన్నీళ్లు ఖచ్చితంగా రావాలి. వస్తాయి కూడా బోనస్ గా కళ్ళు ఉబ్బి పోయి ముఖం కూడా వాచిపోతుంది. కానీ.. మీరు ఎప్పుడైనా అప్పుడే పుట్టిన పిల్లలు ఎడ్వడం చూశారా.. అప్పుడే పుట్టిన పిల్లలు హాస్పిటల్ దద్దరిల్లేలా ఏడుస్తారు. మీరు గమనించారో లేదో వాళ్ళకి చుక్క నీరు కూడా రాదు. అంత విపరీతంగా ఏడ్చినా కన్నీళ్లు రావు. వాస్తవానికి అప్పుడే పుట్టిన బిడ్డ ఏడ్వాలి.
ఏడ్వకపోతే అదో కంగారు, ఎందుకు ఏడ్వలేదు అని ఏదో ఒకటి చేసి ఏడిపిస్తారు. అక్కడి వరకు బానే ఉంది. మరి చిన్న పిల్లాల్లో కన్నీళ్లు ఎందుకు రావు? అనే విషయానికి వస్తే.. దీనిపై శాస్త్రవేత్తలు పరిశోధన చేసి ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. కన్నీళ్లు రాకపోవడం అనేది శిశువు శరీర అభివృద్ధికి సంబంధించినది. ఒక వ్యక్తి ఏడ్చినప్పుడల్లా కన్నీళ్లకు ఒక ప్రత్యేక రకమైన వాహిక బాధ్యత వహిస్తుంది.
అయితే నవజాత శిశువులో ఇది పూర్తిగా అభివృద్ధి చెందదు. డెవలప్ కావడానికి కొంత సమయం పడుతుంది. అందుకే అప్పుడే పుట్టిన శిశువుకు ఎంత ఏడ్చినా కన్నీళ్లు రావు. ఈ వాహిక అభివృద్ధి చెందిన తర్వాతే పిల్లలకి కన్నీళ్లు రావడం ప్రారంభం అవుతాయని వాళ్లు పేర్కొన్నారు. నవజాత శిశువులు ఎక్కువగా ఏడుస్తారని, అయితే వారికి కన్నీళ్లు రావడానికి సాధారణంగా రెండు వారాలు పడుతుందంటున్నారు వైద్యులు.
కొంతమంది పిల్లలకు రెండు వారాలకంటే.. ఎక్కువ టైం పడుతుంది. కొంతమంది పిల్లలలో ఈ నాళం అభివృద్ధి చెందడానికి 2 నెలలు కూడా పట్టవచ్చును. కంటి ఎగువ కనురెప్పకు దిగువన భాగం ఆకారపు గ్రంధి ఉంటుంది. ఈ గ్రంథి నుండి కన్నీళ్లు వస్తాయి. ఈ గ్రంథి కళ్లలో తేమను గ్రహిస్తుంది. దీని కారణంగా కళ్ల కదలిక తేలికవుతుంది.
కన్నీటిని ఉత్పత్తి చేసే ఈ గ్రంథి మేఘంలాగానూ, నాళం గొట్టంలానూ ప్రవర్తిస్తుందని, దీని ద్వారా కళ్లలో నుంచి నీళ్లు వస్తాయని నిపుణులు అంటున్నారు. పెద్దవారికి కూడా ఏడిస్తే.. కళ్లు పొడిబారిపోతాయి. కళ్లలో వాటర్ ఉండదు. అందుకే ఎవరైనా ఏడుస్తుంటే.. పక్కనవాళ్లు వెంటనే నీళ్లు ఇస్తారు. ఏడ్వటం వల్ల కళ్లలో ఉండే నీళ్లు అంతా కరిగిపోతాయి. దాని వల్ల కళ్ల మంటలు, తలనొప్పి వస్తాయి.