Is it Good to Walk after Dinner : రోజు ఉదయం లేవగానే నడక ఆరోగ్యానికి చాలా మంచిదంటారు. ఒక గంట నడక శరీరానికి ఎంతో ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. మరి రాత్రిపూట డిన్నర్ చేసిన తర్వాత నడక మంచిదేనా.. ఎంతసేపు నడవాలి.. ఏ టైంలో నడవాలి..? ఇలాంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
తిన్న తర్వాత నడవడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు చేకూరుతాయి. ముఖ్యంగా ఆహారం త్వరగా జీర్ణం అవ్వడమే కాకుండా, గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం సమస్యలు దూరం అవుతాయి. శరీరం పోషకాలను చురుగ్గా గ్రహించుకోవడంలో ఈ నడక ఉపయోగపడుతుంది. అలాగే చాలామంది రాత్రిలో నిద్ర పట్టడం లేదని ఇబ్బంది పడతారు.
అలాంటివారు డిన్నర్ తర్వాత కొద్దిగా సేపు నడిస్తే శరీరం అలసటకు గురై నిద్ర మంచిగా పడుతుంది. వాకింగ్ వల్ల హార్మోన్ లో ఉత్పత్తి పెరుగుతుంది. అలాగే ఉల్లాసంగా, ఉత్సాహంగా కూడా ఉండడానికి ఈ నడక ఉపయోగపడుతుంది. ఒత్తిడి, అలసట వంటివి దరిచేరవు. రాత్రి భోజనం చేసిన తర్వాత 15 నిమిషాల తర్వాత నడవడం మంచిది. అయితే భోజనం తర్వాత ఇంకా ఏ రకమైన చిరు తిండ్లు తినకూడదు.
మధుమేహం ఉన్నవారు భోజనం చేసిన తర్వాత 30 నిమిషాల పాటు నడిస్తే, రక్తంలో చక్కెర స్థాయి పెరగకుండా కంట్రోల్ లో ఉంటుంది. తిన్న తర్వాత నడవడం వల్ల గుండెజబ్బులకు అడ్డుకట్ట వేస్తుంది. రోగనిరోధక వ్యవస్థ బలపడమే కాకుండా, వెయిట్ లాస్కు కూడా ఈ నడక ఎంతో బాగా ఉపయోగపడుతుంది.