Kitchen Tips : ప్రతి ఇల్లాలు ఉదయం లేవగానే వంట పనిలో చాలా హడావిడిగా ఉంటారు. వంట పని సులభంగా అయిపోవాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే ఈజీగా మనం ఆ పనిని పూర్తి చేయవచ్చు. కొన్ని సందర్భాలలో మనం ఎంత జాగ్రత్తగా వంట చేసినా కూడా కొన్ని పొరపాట్ల వల్ల ఆలస్యం అవుతూ ఉంటుంది. హడావిడి లేకుండా వంట త్వరగా అయిపోవాలంటే కొన్ని చిట్కాలు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. వాటిని అనుసరిస్తే సరిపోతుంది.
1.ఉదయం లేవగానే చాలామంది బ్రేక్ ఫాస్ట్ కోసం దోశలను ఎక్కువగా వేస్తూ ఉంటారు. దోశలు వేస్తున్నప్పుడు చాలాసార్లు పెనానికి అంటుకుపోతూ ఉంటాయి. అలా అతుక్కుపోకుండా దోశలు సులభంగా రావాలి అంటే పెనం మీద వంకాయ ముక్కతో రుద్దాలి.
2.చిన్నలకు, పెద్దలకు ఆమ్లెట్లు అంటే చాలా ఇష్టంగా ఉంటుంది. అలాంటి ఆమ్లెట్లు వేసినప్పుడు అవి పెద్దగా పొంగినట్లు రావాలి అంటే, ఆమ్లెట్ వేసేముందు ఆ బ్యాటర్ లో ఒక స్పూను మైదా పిండి కలిపి వేస్తే ఆమ్లెట్ చక్కగా వస్తుంది.
3.మన ఇంట్లో ఎక్కువ రోజులు నిల్వ ఉండే వస్తువులలో బియ్యం కూడా ఒకటి. బియ్యం మనం ఎక్కువగా తెచ్చుకొని వాటిని నిల్వ ఉంచుతూ ఉంటాము. అలా నిల్వ ఉంచినప్పుడు పురుగు పట్టడం సహజం. బియ్యానికి పురుగు పట్టకుండా ఉండాలి అంటే బియ్యం డబ్బాలో కరివేపాకు రెమ్మలు గాని, లేదా పుదీనా ఆకులను గాని వేస్తే పురుగు రాదు.
4.కూరలు వండేటప్పుడు కూర పూర్తయ్యలోపు ఒక్కోసారి సహజరంగును కోల్పోతూ ఉంటాయి. అలా కాకుండా కూర వండేటప్పుడు నూనె వేడెక్కగానే ఆ నూనెలో చిటికెడు పసుపు వేసినట్లయితే కూరలు సహజరంగును కోల్పోకుండా ఉంటాయి.
5.ప్రతి ఒక్కరి ఇంట్లో వాడే వస్తువులలో వెల్లుల్లి కూడా ఒకటి. కానీ వెలుల్లి పొట్టును ఉలవాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలా కాకుండా సులభంగా పొట్టును వలచుకోవాలి అంటే, వెల్లుల్లి ని ముందుగా ఫ్రిజ్లో ఉంచితే పొట్టు సులభంగా వచ్చేస్తుంది. ఎక్కువకాలం తాజాగా కూడా ఉంటుంది.