Kitchen Tips : ప్రతి రోజు మనం హడావిడిగా పనులు చేసుకుంటూ ఉంటాం..ఆ పనులను కాస్త ప్లాన్ ప్రకారం సెట్ చేసుకుంటే..సులభంగా పనులు పూర్తి చేసుకోవచ్చు. పనులు ఎలా శుభ్రంగా,సమయానికి పూర్తి చేసుకోవాలో కొన్ని చిట్కాలు తెలుసుకుందాం.
గాజు గ్లాసులను చాలా జాగ్రత్తగా శుభ్రం చేయాల్సి ఉంటుంది. వాటిని శుభ్రం చేయడం కోసం నీళ్లలో మనం బట్టలకు ఉపయోగించే బ్లూ ని వాడితే గాజు గ్లాసులు తల,తలా మెరిసిపోతాయి. గ్యాస్ స్టవ్ బర్నర్స్ ని శుభ్రం చేయాలి అంటే కష్టంగా అనిపిస్తుంది. వాటిని శుభ్రం చేయటానికి సిరంజి నీడిల్స్ వాడితే సులువుగా శుభ్రం చేసుకోవచ్చు.
ప్రతి ఒక్క కూరలో కరివేపాకును వాడుతుంటాం అలాంటి కరివేపాకును ఎక్కువ రోజులు ఉంచితే వాడిపోతూ ఉంటుంది. కరివేపాకును నూనెలో వేయించి చల్లారాక గాజు సీసాలో భద్రపరుచుకుంటే కూరలల్లో రోజు వాడుకోవచ్చు, మంచి రుచిని కూరలకి ఇస్తుంది.
ఆకుకూరలను తడిబట్టలో చుట్టి ఫ్రిడ్జ్ లో పెడితే తాజాగా ఉంటాయి. కాకరకాయ చేదు తగ్గాలి అంటే ,కాకరకాయ వండే సమయంలో పచ్చి మామిడి కాయ ముక్కలు కూరలో వేస్తే కాకరకాయ చేదు పోతుంది. కూర రుచిగా ఉంటుంది.
మనం కొత్తగా పాత్రలు కొన్నప్పుడు వాటికి ఉండే స్టిక్కర్స్ సులభంగా పోవాలంటే, ఆ స్టిక్కర్ కి కొవ్వొత్తి వేడి పెడితే సులభంగా పోతాయి. కంప్యూటర్ కీ బోర్డ్, మౌస్ ఇలాంటి వాటిపై మరకలను నెయిల్ ఫాలిష్ కి వాడుకునే రిమూవర్ తో సులభంగా పోగొట్టవచ్చు.