Kitchen Tips : మన ఇంటిలో ముఖ్యమైన గది వంటగది. మన ఆరోగ్యం మొత్తం ఆ వంట గదిలోనే నిక్షిప్తమై ఉంటుంది. ఎందుకంటే వంటగది శుభ్రంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాము. వంటగది అపరిశుభ్రంగా ఉంటే మనం రోగాలను ఆహ్వానించినట్టే. అలాంటి ముఖ్యమైన వంటగదిని శుభ్రంగా ఎలా ఉంచుకోవాలి.? దానికి పాటించవలసిన చిన్న, చిన్న అతి సులభమైన చిట్కాలు ఏమిటి..?
వంటగదిలో వంట చేసేటప్పుడు మిగిలిపోయిన వేస్ట్ ని వేయడం కోసం ఒక కవర్ డస్ట్ బిన్ నీ ఉపయోగించాలి. వంట గదిలో చెత్త పేరుకుపోయినట్లయితే అవి దోమలకు, బొద్దింకలకు, ఈగలకు నిలయంగా మారుతుంది. వాటి ద్వారా అనేక వ్యాధులు సంక్రమిస్తాయి. కాబట్టి మూత ఉన్న డస్ట్ బిన్ ని వాడడం ఉత్తమం.
వాష్ బేసిన్, సింక్ ను ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. వంట చేసేటప్పుడు సింక్ ను ఎక్కువగా వాడుతూ ఉంటాము. దాంట్లోనే వంట సామాగ్రికి సంబంధించిన పదార్థాలను శుభ్రపరుస్తూ ఉంటాము. మాంసము ఇతర పదార్థాలు, నూనె వస్తువులను కూడా సింక్ లోనే శుభ్రపరచడం వల్ల అక్కడ బ్యాక్టీరియా ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
కాబట్టి సింక్ ని ఎప్పుడు డిటర్జెంట్ పౌడర్ తో కడిగి శుభ్రంగా ఉంచుకోవాలి. సింక్ పైపును నెలలో రెండుసార్లు శుభ్రంగా కడిగి తిరిగి అమర్చుకోవాలి లేదంటే ఆ పైపులో బ్యాక్టీరియా ఫైవ్ పురుగులు లాంటిది వచ్చే అవకాశాలు ఎక్కువ. వంట చేసే సమయంలో గ్యాస్ స్టవ్ మీద పదార్థాలు చిందుతూ ఉంటాయి. వాటిని వెంటనే శుభ్రపరచాలి.
లేకపోతే బ్యాక్టీరియా సంతానోత్పత్తి అవుతుంది. పాలు, పెరుగు లాంటివి చిందినప్పుడు గోరువెచ్చ నీటితో స్టవ్ పరిసర ప్రాంతాలను శుభ్రపరచుకోవడం మంచిది. వంటగది ప్లాట్ ఫామ్ మీద కూరగాయలు కట్ చేయడం, చపాతీలు చేయడం లాంటివి ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇలాంటి సందర్భంలో ప్లాట్ ఫామ్ ని రోజు విడిచి రోజు శుభ్రంగా కడగాలి. లేదంటే చాలా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.
.