Laughter : నవ్వుతో సకల అనారోగ్య సమస్యలను కూడా పోగొట్టుకోవచ్చు. నవ్వు శరీరానికి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు. నవ్వు వల్ల మనకు ఉన్నటువంటి ఒత్తిడి దూరం అవుతుంది. ఒక నవ్వుతో మనిషి పడే బాధలను కాస్తయినా రిలీఫ్ పొందవచ్చు. అయితే ఈ నవ్వు వల్ల ఇంకా ఏ ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం. తాజాగా చేసిన అధ్యయనాల్లో నవ్వుకు ఒక హీలింగ్ పవర్ ఉందని గుండె సమస్యల భారీ నుండి రక్షిస్తుంది, గుండె కణజాల విస్తరణ
ప్రేరేపించడమే కాకుండా, మన శరీరానికి కావాల్సిన ఆక్సిజన్ ని కూడా సరఫరా చేస్తుందని వైద్య నిపుణులు తెలిపారు. 64 ఏళ్ల వయస్సుగల 26 మందిని రెండు గ్రూపులుగా విడగొట్టి రెండు నెలల పాటు హార్ట్ డిసీజ్ సింప్టమ్స్‌ను పరిష్కరించడంలో లాఫింగ్ థెరపీ ఎలా హెల్ప్ అవుతుందో స్టడీ చేసారు.. ఇందులో ఈ రెండు గ్రూపులలో ఒక గ్రూపు వారానికి రెండుసార్లు కామెడీ ఆక్టివిటీస్, అలాగే రెండవ గ్రూపు పాలిటిక్స్ అండ్ అమెజాన్ రైన్ ఫారెస్ట్ వంటి సబ్జెక్టుతో కూడిన డాక్యుమెంటరీ చూసేలా వారు ఏర్పాటు చేశారు.
రెండు నెలలు గడిచిన తర్వాత పాలిటిక్స్ చూసిన గ్రూపు కంటే కామెడీ చూసిన గ్రూప్ యొక్క గుండె చాలా ఆరోగ్యంగా ఉన్నట్లు వెళ్లడయింది. పైగా వీరిలో కార్డియో వాస్క్యులర్ వ్యవస్థ ఫంక్షనల్ యాక్టివిటీస్ 10 శాతం పెరిగాయని, గుండెపోటు లేదా పక్షవాతం వచ్చే ప్రమాదం నుంచి బయటపడ్డారని వైద్య నిపుణులు నిర్ధారించారు.