Lemon Specialty : నిమ్మకాయ లేకుండా ఎటువంటి పూజ కార్యక్రమాలు నిర్వహించారు. మనము ఏ పూజను గమనించినా కూడా ఖచ్చితంగా అందులో నిమ్మకాయ కనిపిస్తుంది. నిమ్మకాయను ప్రతికూల శక్తులకు వ్యతిరేకంగా వాడుతారు. పూజలో నిమ్మకాయను ఉంచడం వల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ పోతుందని చాలామంది ప్రగాఢ విశ్వాసం.
పురాణాల్లో నిమ్మకాయ యొక్క విశిష్టత గురించి చరిత్ర కూడా రాసి ఉంది. నింబాసురుడు అనే రాక్షసుడు శివుడు, బ్రహ్మదేవుడి నుంచి వరాలు పొంది శక్తివంతుడు అవుతాడు. ఆ శక్తితో ప్రజలను వేధించడం మొదలు పెడతాడు. రాక్షసుని యొక్క క్రూరత్వం, ప్రజలను పెట్టే హింసను చూసి
రుషి అగస్త్యుడు ఆ రాక్షసుడి బారి నుండి భూమిని, ప్రజలను కాపాడడం కోసం దుర్గామాతకు తపస్సు చేస్తాడు. అగస్త్యుడి తపస్సుకు మెచ్చిన దుర్గామాత నింబాసురిడిని సంహరిస్తుంది. అప్పటినుండి దుర్గామాతను “శాకంబరీ దేవిగా” భక్తులు కొలుస్తున్నారు. దుర్గామాత యొక్క దివ్య రూపాన్ని చూసిన నింభాసురుడు ఆమె ఆగ్రహాన్ని తట్టుకోలేక, మరణించే ముందు తనకు ఒక వరాన్ని ప్రసాదించమని కోరుకుంటాడు.
నింభాసురుని కోరికను దుర్గామాత తీరుస్తుంది. ఎప్పటికీ కూడా నిమ్మకాయ రూపంలో భూమి మీద ఉంటూ ప్రతి ఒక్క పూజలో స్థానం కల్పిస్తూ వరం ఇస్తుంది. ఇక ఆ రోజు నుంచి హిందూ ఆచార, సాంప్రదాయాల్లో, పూజ, పునస్కారాలలో నిమ్మకాయకు ప్రథమ స్థానం లభించింది.