Loneliness : ప్రతి ఒక్కరి దయానందన జీవితంలో ఏదోఒక రూపంలో ఒత్తిడి అనేది ఎదుర్కొంటూనే ఉంటారు. చాలా రకాల పరిస్థితుల వల్ల కొందరు మానసికంగా ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటారు. దాంట్లో ముఖ్యంగా ఈ మధ్యకాలంలో యువత పెద్దసంఖ్యలో నిలుస్తున్నారు. ఒంటరితనాన్ని ఫీలయ్యేవారు డిప్రెషన్ లోకి వెళ్లే ప్రమాదం ఉంది. అలా వెళ్తే వారు చాలా ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఒక్కోసారి ఈ డిప్రెషన్ అనేది మరణానికి కూడా దారి తీయవచ్చు. మరి అలాంటి ఒంటరితనాన్ని ఎలా జయించవచ్చు.. ఒంటరితనంలోకి మనుషులు నెట్టి వేయబడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒంటరితనానికి కారణాలు స్నేహితులను కోల్పోవడం, చదువుకునే, ఉద్యోగం చేసే స్థలాలల్లో ఎదుర్కొనే కొన్ని రకాల సంఘటనల వల్ల పిల్లలు, యువత ఎక్కువగా ఈ సమస్యను అనుభవిస్తున్నారు.
పిల్లల విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారిని ఎప్పుడు గమనిస్తూ ఉండాలి. టీనేజ్ లో ఉన్న పిల్లలు ఒంటరిగా ఫీలవుతున్నారేమో, సైలెంట్ గా ఉండడం, వీక్ అయిపోవడం లాంటివి చేస్తున్నారేమో తల్లిదండ్రులు గమనించాలి. అలాంటి వారి ఆలోచనా విధానాన్ని మార్చే బాధ్యతను పెద్దలు వహించాలి. ఒంటరిగా ఫీలయ్యే వాళ్ళని ఏదో ఒక పనిలో బిజీగా ఉండేలాగా చూడాలి.లేకపోతే పిల్లలు డిప్రెషన్ కి గురి అయ్యే ప్రమాదం ఉంది.
ఒంటరితనాన్ని అనుభవించే వాళ్ళని కొన్ని పనుల్లో నిమగ్నం చేయడం వల్ల ఆ సమస్య నుంచి వారిని బయటపడవేయవచ్చు. వాటిలో ముఖ్యంగా ఆటలు ఆడించడం, పుస్తకాలు చదివించడం, గార్డెనింగ్, వంట, పెయింటింగ్ లాంటివి వీరికి అలవాటు చేయాలి. వీటివల్ల వారు ఆ ఫీలింగ్ నుండి కాస్తైనా బయటపడతారు. అలాగే మనుషులతో వీరికి సత్సంబంధాలు మెరుగుపరచాలి. నలుగురిలో వీరిని ఎక్కువగా కలుపుతూ ఉండాలి.