Losses if you Don’t Sleep for 72 Hours : మానవులు సంపూర్ణ ఆరోగ్యాన్ని కలిగి ఉండాలంటే నిద్ర చాలా అవసరం. అయితే నిద్రలేమి వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని మనకు తెలుసు. నిద్ర లేమిని నయం చేసే వైద్యం ఇప్పటివరకు అందుబాటులో లేదు. కాబట్టి తగినంత నిద్రను మన శరీరానికి అందించవలసిన బాధ్యత మన మీదనే ఆధారపడి ఉంటుంది.
తగినంత నిద్ర శారీరక ,మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుంది. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం 18 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసున్న వారు రాత్రికి కనీసం ఏడు గంటలు నిద్రపోవాలని వారు తెలియజేస్తున్నారు. అయితే ఒక మనిషి నిద్ర లేకుండా ఎంతకాలం జీవించగలడు అనే దాని పైన కూడా వారి అధ్యయనం సాగింది.
కానీ ఆ విషయం పట్ల వారు ఎటువంటి స్పష్టతను ఇవ్వలేదు. కానీ చాలామంది మాత్రం పని, ఒత్తిడి తదితర కారణాలవల్ల నిద్రలేమీ లాంటి సమస్యలను అనుభవిస్తున్నారని తెలిసింది. ఒకవేళ ఒక వ్యక్తి 72 గంటల పాటు నిద్రపోకుండా ఉంటే ఏం జరుగుతుంది..? చాలామందిలో 24 గంటలు మెలకువగా ఉండి నిద్రపోకుండా ఉంటే అనారోగ్య సమస్యలు కనిపిస్తాయి.

24 గంటలు మేల్కొన్న వ్యక్తి రక్తంలో BAC స్థాయి 0.10 సున్న శాతానికి సమానం. ఇది చివరికి చిరాకు, ఏకాగ్రతను కోల్పోవడం, ఒత్తిడి, కండరాలలో నొప్పి, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వంటి దుష్పరిణామాలను కలిగిస్తుంది. ఒక వ్యక్తి ఎంత మెలకువగా ఉంటే నిద్రలేమి ప్రభావం అంత ఎక్కువగా ఉంటుంది.
ఎవరైనా 48 గంటలు నిద్రపోకుండా అలాగే మేల్కొని ఉంటే మాత్రం వారు తీవ్రమైన ఒత్తిడికి గురవుతారు. నీరసం వారిని ఆవహిస్తుంది. వారి మెదడు మైక్రోస్లిప్ అని పిలవబడే పూర్తి అపస్మారాక స్థితిలోకి వెళ్లడం మొదలవుతుంది. నిద్రలేమి వల్ల ఇంత భయంకరమైన సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే 72 గంటల పాటు నిద్రపోకుండా ఉంటే అలసట లక్షణాలు తీవ్రతరమవడమే కాకుండా,
మూడు రోజుల పాటు నిద్ర లేకుండ ఉండటం వల్ల మనిషి మానసిక స్థితి, ఆరోగ్యం పై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపెడుతుంది. చివరాకరకు మూర్చ, చిరాకు లాంటివి కనిపిస్తాయి. స్థిరంగా నిద్రపోకుండా అలాగే ఉంటే మాత్రం అధిక రక్తపోటు, మధుమేహము, ఉబకాయము, గుండె జబ్బులు, డిప్రెషన్ వంటి సమస్యలు తలెత్తడం జరుగుతుంది. అందుకే ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ మనిషి రోజుకి 8 గంటలు కచ్చితంగా నిద్రపోవాలి.
