Mobile Side Effects in Summer : ఎండాకాలం సూర్యుడు తన ప్రతాపం చూపిస్తూనే ఉంటాడు. ఉదయం తొమ్మిది దాటిందంటే మాత్రం బయటికి వెళ్లడం కష్టమే అంతలా ఎండ ఉష్ణోగ్రత పెరిగిపోయింది. ఈ పెరిగిన ఉష్ణోగ్రతతో అందరూ చాలా ఆందోళన పడుతున్నారు. ఉష్ణోగ్రత తీవ్రతకు చాలా ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి.
ఇంత ఉష్ణోగ్రతలో ఎలక్ట్రానిక్ పరికరాలు వాడడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఇప్పుడు చూద్దాం.అన్నింటికంటే ముఖ్యంగా ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు ఫోన్ వాడడం అనేది చాలా ప్రమాదకరం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈరోజులలో ఫోన్ వాడకుండా ఒక నిమిషం కూడా ఉండలేని పరిస్థితి. ఏ పని చేయాలన్నా ఎక్కువగా ఫోన్ ని వాడుతుంటాం.
ఉదాహరణకి వాటర్ బిల్ కట్టాలన్న, కరెంట్ బిల్ కట్టాలన్న, బస్సులో వెళ్తున్న, బైకుల మీద వెళుతున్న మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా ఫోన్ మన చేతిలో ఉంటుంది. ఫోన్ వాడకం సర్వసాధారణం అయిపోయింది. మీగతా సమయాల్లో ఫోన్ వాడడం అంత పెద్దగా ప్రమాదం ఉండకపోవచ్చు. కానీ ఎండలో మాత్రం ఫోన్ వాడితే కళ్ళ సమస్యలు వస్తాయి.
కళ్ళ చూపు మందగించడం లాంటివి జరుగుతాయని చాలా అధ్యయనాల్లో తేలింది. ఫోను ఎక్కువగా “ఫ్లైట్ మోడ్” లో ఉంచడం మంచిది. అలాగే ఫోన్ లో ఎక్కువ గేమ్స్ ఆడటం లాంటి వాటిని కూడా కంట్రోల్ చేయాలి. ఎందుకంటే ఫోన్ కి బాహ్య ఉష్ణోగ్రత కంటే అంతర్గతంగా ఉష్ణోగ్రత ఎక్కువ ప్రభావం చూపిస్తుంది.
గేమ్స్ ఆడినప్పుడు ఇది ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. కాబట్టి వీలున్నంతవరకు ఫోన్ ని ఫ్లైట్ మోడ్ లో ఉంచండి. ఫోన్ ఎక్కువ సమయం కార్లో ఉంచడం చాలా ప్రమాదం ఎందుకంటే, 95 డిగ్రీల ఒక రోజు ఎండలో కార్ పార్క్ చేసినట్లయితే, ఫోన్ కారులో ఒక గంటలో 116 డిగ్రీలకు ఉష్ణోగ్రత చేరుతుందని అంచనా..
ఆపిల్ లాంటి ఫోన్ లను 95 డిగ్రీల కంటే ఎక్కువ ఐఫోన్ ను వాడడం ప్రమాదమని సూచిస్తుంది. ఫోన్ చార్జింగ్ పెట్టినప్పుడు వేడెక్కుతూ ఉంటుంది. అలాగే ఎండ తగిలే ప్రదేశంలో ఫోన్ చార్జింగ్ పెడితే అది ఇంకా వేడెక్కి దుష్ప్రభావాన్ని ఇస్తుంది. కాబట్టి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్న స్థలాల్లో ఫోన్ ని చార్జింగ్ పెట్టకపోవడం మంచిది. వాడకం ఎక్కువైనప్పుడు ఫోన్ బాగా వేడెక్కితే స్విచ్ ఆఫ్ చేసి పెట్టడం మంచిది.
