Monsoon Food : వర్షాకాలం వస్తూనే ఎన్నో రకరకాల ఇన్ఫెక్షన్లను, బ్యాక్టీరియాను, వైరస్లను మోసుకొస్తుంది. వర్షాకాలంలో అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువ. వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచుకొని రోగాల బారి నుండి మన శరీరాన్ని కాపాడుకోవాలంటే కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటించి, రోజువారి ఆహారంలో వాటిని ఉండేలా చూసుకోవాలి. అలా చేస్తే కొన్ని ఇన్ఫెక్షన్ల నుండి వైరస్ ల నుండి మనం బయటపడవచ్చును. వర్షాకాలంలో ఎక్కువగా జలుబు, దగ్గు సమస్య బాధపెడుతూ ఉంది.
అలాగే వైరల్ ఫీవర్స్ కూడా ఎక్కువగా ఇబ్బందికరంగా మారుతాయి. చిన్నపిల్లల్లో, పెద్దల్లో వయసు తో సంబంధం లేకుండా వర్షాకాలం మొత్తం వైరస్ ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమస్యల నుంచి బయటపడేయడానికి కొన్ని ఆహార దినుసులు మనకు అందుబాటులో ఉన్నాయి. వాటిని ఎలా ఉపయోగించాలి వాటి ద్వారా ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవచ్చు ఇప్పుడు తెలుసుకుందాం..
పసుపు : పసుపు యాంటీబయోటిక్ అని మనందరికీ తెలుసు. పసుపు అనేక రకాల జబ్బుల నుండి మనల్ని బయటపడ వేస్తోంది. ముఖ్యంగా బ్యాక్టీరియా నుంచి పసుపు కాపాడుతుంది. పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఇన్ఫ్లమేటరీ మనల్ని వ్యాధుల నుండి రక్షించడంలో దోహదపడతాయి. ప్రతిరోజు గ్లాసు పాలలో కొద్దిగా పసుపు వేసుకొని తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
లవంగం : లవంగాలు ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్ ,ఇన్ఫ్లోమేటరీ, జింకు, సోడియం, మెగ్నీషియం ,ఫాస్ఫరస్, క్యాల్షియం, పొటాషియం వంటి ఎన్నో లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తి పెంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. మనం ప్రతిరోజు మూడు లవంగాలను తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వర్షాకాలంలో గొంతు నొప్పితో బాధపడేవారు లవంగాలను తింటే ఉపశమనం పొందవచ్చును.
నల్ల మిరియాలు : నల్ల మిరియాలు అందరికీ అందుబాటులో ఉంటాయి. ఈ మిరియాల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. వాటి ద్వారా గొంతు నొప్పి, దగ్గుతో బాధపడే వారు రోజు పాలలో చిటికెడు నల్ల మిరియాల పొడిని వేసుకుని తాగితే ఉపశమనం పొందవచ్చు. అలాగే నల్ల మిరియాలు రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతాయి.
దాల్చిన చెక్క : దాల్చిన చెక్క కూడా రోగనిరోధక శక్తిని పెంచడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. దాల్చిన చెక్క తీసుకోవడం వల్ల ఆకలిని మెరుగుపరచుకోవచ్చు. అలాగే కడుపు పూత వంటి ఇబ్బందులను తొలగించుకోవచ్చు. మలబద్ధకం, ఉబ్బరం, వికారం వంటి సమస్యలతో బాధపడేవారు దాల్చిన చెక్కను తినడం వల్ల ఉపశమనం పొందుతారు. రోజు పాలల్లో దాల్చిన చెక్క పొడి కలుపుకొని తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.