Pancreatic Cancer Symptoms : మారుతున్న జీవనశైలిలో ఎన్నో రకాల వ్యాధులు మనుషులను ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వాటిలో ముఖ్యంగా క్యాన్సర్ అతి ప్రమాదకరమైనది. క్యాన్సర్ పేరు వింటేనే చావుకోరల్లోకి వెళ్లినట్టుగా ఉంటుంది. కాన్సర్ తో చాలామంది మరణిస్తున్నారు. అయితే క్యాన్సర్ లో కూడా చాలా రకాలు కలవు. ఊపిరితిత్తులు, చర్మం, రొమ్ము, గొంతు ఇలా ఎన్నో రకాల క్యాన్సర్లు ఉన్నాయి. వీటితో పాటుగా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కూడా ఈమధ్య భయపెడుతుంది.
ఈ క్యాన్సర్ ని గుర్తించిన మొదటి రోజు నుంచి చివరి వరకు కూడా చాలా రకాల బాధలను అనుభవించాల్సి ఉంటుంది. దీనిని మొదటి దశలో కనిపెడితే తప్పించుకోవడానికి అవకాశాలు ఉన్నాయని వైద్యులు తెలుపుతున్నారు. సరైన వైద్యం తీసుకోకపోతే ప్రమాదకరంగా మారి ప్రాణాలకే ముప్పు అని వారు హెచ్చరిస్తున్నారు. మరి ఈ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ రావడానికి కారణాలు, దాన్ని ఎలా కనుక్కోవాలి, వైద్యుల సలహాలు ఏమిటో తెలుసుకుందాం..
ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ..
ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కడుపు భాగంలో వస్తుంది. గ్యాస్, అసిడిటీ ఈ క్యాన్సర్ యొక్క లక్షణాలు. వీటిని గుర్తించడం ఆలస్యమైతే వైద్యం సరైన సమయంలో అందకపోతే ప్రాణాలకే ప్రమాదం.
క్యాన్సర్..
ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఉంటే తిన్న, తినకపోయినా కూడా కడుపు నిండుగా ఉన్నట్టు, ఏదైనా తిన్న తర్వాత కడుపులో తట్టుకోలేనంత నొప్పి రావడం, కడుపు ఉబ్బరంగా ఉండడం, గ్యాస్ కి సంబంధించిన మందులు వాడినా కూడా ఏలాంటి ప్రయోజనం ఉండకపోవడం, అన్నం జీర్ణం కాకపోవడం, వాంతులు అవడం పొట్ట చాలా వరకు తగ్గడం, మలం నల్లగా రావడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.
పెయిన్ కిల్లర్స్
చిన్న నొప్పి రాగానే పెయిన్ కిల్లర్స్ ని వాడేస్తూ ఉంటారు. అది చాలా ప్రమాదం. ముఖ్యంగా బాడీ పెయిన్స్, కండరాల నొప్పులు వచ్చినప్పుడు పెయిన్ కిల్లర్స్ వాడితే చాలా నష్టాలను చవి చూడవలసి ఉంటుంది. ఈ మందుల వల్ల బ్యాక్టీరియా కడుపులోకి చేరడంతో గ్యాస్ సమస్య పెరిగి చాతిలో మంటలు వచ్చే అవకాశం ఉంది.
గ్యాస్ ట్రబుల్
గ్యాస్ ట్రబుల్ వల్ల ఛాతిలో మంట సమస్య ఉంటుంది. సమయానికి తినకపోవడం, ఆల్కహాలు, సిగరెట్ అలవాటు ఉండటం వల్ల గ్యాస్ అసిడిటీ సమస్యలు వస్తాయి. ఈ క్యాన్సర్ తో బాధపడేవారు కడుపులో యాసిడ్ ఉత్పత్తి పెరిగి అల్సర్లు పెరుగుతాయి.
ఎలా టెస్ట్ చేస్తారు
ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌ను గుర్తించడానికి ఎండోస్కోపీ చేస్తారు. పైన తెలిపిన లక్షణాలు కనిపించగానే వైద్యులను సంప్రదించాలి.