Parenting Tips : ఈ ఫాస్ట్ జనరేషన్ కు తగ్గట్టు పిల్లలను తల్లిదండ్రులు పెంచడం అంటే మాములు విషయం కాదు. పిల్లల ఐక్యూ లెవెల్స్ పెంచాలి అంటే పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సి ఉంటుంది తల్లిదండ్రులు. పిల్లల ఐక్యూని ఎలా పెంచాలి?ఒకటి నుండి మూడు సంవత్సరాల లోపు పిల్లల ఐక్యూని పెంచడానికి,తల్లిదండ్రులు
చిన్న,చిన్న బొమ్మలతో ఆడించడం,బ్లాక్స్ లాంటి చేప వాటిని ఒకదానితో ఒకటి జతపరచడం,బిల్డింగ్ ను తయారు చేయడం, బంతులు, ఇతర బొమ్మలతో ఆడించడం, వారి ఆలోచనా విధానాన్ని ప్రదర్శించవచ్చు. ఇలాంటి పద్ధతి పిల్లలకు ఒక వ్యాయామం అని చెప్పవచ్చు. ఇది వారి ఆలోచన సామర్థ్యాన్ని పెంచుతుంది.
అలాగే పిల్లలతో డ్రాయింగ్ వేయించడం కూడా అలవాటు చేసుకోవాలి. బొమ్మలు వేయడం వాటి రంగులు అద్దడం పిల్లల్లో సృజనాత్మకతను వెలికి తీస్తుంది. చిన్న, చిన్న పదాలకు స్పెల్లింగ్ నేర్పించడం మనుషులను గుర్తించడం ఇట్లాంటివి తరచూ చేస్తుంటే పిల్లలు ఐక్యంగా ఉంటారు..
3 నుండి 5 సంవత్సరాల పిల్లలతో క్రాస్‌వర్డ్ పజిల్స్, జిగ్సా పజిల్స్, పిల్లలకు కార్డ్ మ్యాచింగ్ కరెక్షన్ కార్డ్స్ గేమ్స్, అంతాక్షరిని ఆడించవచ్చు, ఇతర భాషల కొత్త పదాలను కూడా నేర్పించవచ్చు. పిల్లల ఐక్యూ ని పెంచడానికి, వారికి మంచి నీతి కథలు చెప్పడం,వారితో చదివించడం చేపించాలి. ఇలా చేస్తే పిల్లల మెదడు చురుగ్గా మారుతుంది.
ఇక పిల్లలను వీడియో గేమ్స్ కి, టీవీ లకు దూరంగా ఉంచితే మంచిది. ఎక్కువసేపు పిల్లలు టీవీ చూడటం వల్ల వారి కళ్ళకు హాని కలుగుతుంది.