Principles of Overcoming Stress in Life : అందరి లైఫ్ లు ఒకేలా ఉండవు. ఈ జీవనశైలిలో చాలా రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. చిన్న చిన్న సమస్యలను కూడా భూతద్దంలో పెట్టి చూస్తూ చాలా ఒత్తిడికి గురై మానసికంగా చాలా ఇబ్బంది పడతారు. కొంతమంది డిప్రెషన్ లోకి కూడా వెళ్లిపోయే అవకాశాలు ఉన్నాయి. లైఫ్ సంతోషంగా ఉండాలి అంటే కొన్ని సూత్రాలను మనం పాటిస్తే వీలైంతవరకు సమస్యలు నుంచి బయటపడి, సంతోషంగా జీవించడానికి మార్గదర్శకాలుగా మారుతుంది.
★మానవ జీవన శైలిలో ప్రధానమైనది డబ్బు. ఇది ఎంత తక్కువ ప్రదర్శించుకుంటే అంత మంచిది. దానివల్ల లేనిపోని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది.
★మనిషికి జ్ఞానం ప్రధానమైనవి. జ్ఞానంతో ఎన్ని విజయాలైన సాధించవచ్చు. జ్ఞానం ఎక్కువగా ఉన్నవారు మాటలు తక్కువగా మాట్లాడుతారు. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.

★నేర్చుకోవడమనేది ప్రతి మనిషికి చాలా అవసరం. రోజుకు కొత్త, కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండాలి.
★సమస్యలు ఉన్నవారికి సహాయం చేయడం అనేది చాలా మంచి పద్ధతి. ఎదుటివారి సమస్యలు తెలుసుకుని వారికి సహాయం చేస్తే మనకు చాలా హ్యాపీగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి పనులు చేస్తూ ఉండాలి.
★నవ్వు..నవ్వు చాలా ముఖ్యం. ఎన్ని కష్టాలు, బాధలు, సమస్యలు, ఒత్తిడి ఉన్నప్పుడు కూడా నవ్వుతూ ఉండాలి. నవ్వు సర్వరోగ నివారిణి అంటారు పెద్దలు. కాబట్టి ఎక్కువ సంతోషంగా ఉండడానికి ప్రయత్నించాలి. నవ్వడం ఆరోగ్యానికి చాలా మంచి ప్రయోజనం.
★ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మైండ్ కి తీసుకోవద్దు. చాలావరకు వాటిని ఇగ్నోర్ చేస్తూ ఉండాలి. అలా అయితేనే ఎక్కువ డిస్టర్బ్ కాకుండా ఉంటారు. ఈ సూత్రాలు పాటిస్తూ ముందుకు వెళితే లైఫ్ లో ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండి, విజయాన్ని అందుకుంటారు.
