Protein Deficiency due to Late Sleep : మన శరీరానికి ప్రోటీన్ కూడా చాలా అవసరం. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో కండరాలను పటిష్టంగా ఉంచి వివిధ రకాల ఎంజైమ్స్ మరియు హార్మోన్ల తయారీలో ప్రోటీన్స్ కీలకపాత్ర పోషిస్తాయి. రోజువారి ఆహారంలో మన శరీర బరువుకు సమానమైన ప్రోటీన్ ను తీసుకోవాలి. ఒక కేజీ బరువుకు ఒక గ్రామ్ ప్రోటీన్ ఉండేలాగా చూసుకోవాలి. ప్రోటీన్ ఉండే ఆహారాలను క్రమం తప్పకుండా తీసుకుంటే ప్రోటీన్ లోపం నుండి బయటపడవచ్చు.
శరీరంలో ప్రోటీన్ లోపం తలెత్తడానికి ముఖ్య కారణం రాత్రి పూట ఆలస్యంగా నిద్రపోవడం. నిద్ర లోపం ఉంటే ప్రోటీన్ లోపం ఖచ్చితంగా మన శరీరంలో చేరుతుంది. నిద్రకు , ప్రోటీన్ కి సంబంధం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా..! ఆలస్యంగా నిద్రించడం వల్ల ప్రోటీన్ లోపం వస్తుంది అని వైద్య నిపుణులు స్వయంగా చెప్పిన మాట. అది ఎలా అంటే..
మనం నిద్రించిన తర్వాత మన శరీరంలో కొన్ని కోట్ల కణాలు చనిపోతూ ఉంటాయి. ఈ మృత కణాల్లో చాలా ప్రోటీన్ దాగి ఉంటుంది. ఈ మృత కణాలను మన శరీరం మళ్లీ తిరిగి వాడుకుంటుంది. ఎలా అంటే మన శరీరం చనిపోయిన మృత కణాలను “విచ్చిన్నం” చేసి వాటిలో ఉండే ప్రోటీన్ ని తిరిగి శరీరానికి అందిస్తుంది. అయితే ఈ ప్రక్రియ మొత్తం మన నిద్రించిన తర్వాత మాత్రమే జరుగుతుంది.
మన నిద్రించిన సమయంలో మన శరీరం మొత్తం విశ్రాంతి దశలో ఉంటుంది. కాబట్టి ఆ ప్రక్రియకు ఆటంకం ఉండదు. ఒకవేళ మనం ఆలస్యంగా నిద్రిస్తే మాత్రం ఈ ప్రక్రియకు అంతరాయం కలిగినట్టే. దాంతో ప్రోటీన్ లోపం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ప్రతి రోజు సాయంత్రం త్వరగా ఆహారాన్ని తీసుకొని త్వరగా నిద్రించాలని నిపుణులు సూచిస్తూ ఉంటారు. దీని ద్వారా రీసైక్లింగ్ వ్యవస్థ మన శరీరంలో సక్రమంగా జరిగి ప్రోటీన్ లోపం తలెత్తదు.