Raw Coconut : కొబ్బరి చెట్టును కల్పవృక్షమని పిలుస్తారు. ఎందుకని అంటే కొబ్బరి చెట్టుకు కాసే కాయలు దాని బెరడు దాని ఆకులు ప్రతి ఒక్కటి కూడా మానవునికి ఉపయోగపడుతూనే ఉంటాయి. కొబ్బరి కాయతో ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకుందాం.. కొబ్బరి నీళ్లు మనకు తెలుసు అవి ఆరోగ్యానికి చాలా ప్రయోజనాన్ని కలిగిస్తాయి. అలాగే జుట్టు, చర్మ సంరక్షణకు కూడా కొబ్బరి చాలా ఉపయోగపడుతుంది.
కొబ్బరి నూనె కొబ్బరి నీళ్లు ఇవి కాకుండా పచ్చికొబ్బరితో కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వీటిల్లో ఉండే విటమిన్ సి, మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్, కాల్షియం, ఖనిజాలు, పోషకాలు పుష్కలంగా పచ్చికొబ్బరిలో మనకు లభిస్తాయి. ఈరోజు ప్రపంచ కొబ్బరి దినోత్సవం సందర్భంగా కొబ్బరి గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం..
రోగనిరోధక శక్తిని పెంచుతుంది : కొబ్బరిలో ఉండే యాంటీ ఫంగల్ ,యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అనేక రకాల వ్యాధుల నుండి రక్షిస్తాయి.
మలబద్ధకం : తక్కువ ఫైబర్ ఉన్న పదార్థాలను తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య వస్తుంది. కొబ్బరిలో ఫైబర్ శాతం అధికంగా ఉంటుంది. కాబట్టి కొబ్బరిని రోజు తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు
గుండెను సంరక్షించడంలో : పచ్చి కొబ్బరి లో ఉండే కొవ్వు చాలా ఆరోగ్యవంతమైనది. ఇది శరీరం సరిగా పనిచేయడానికి సహాయపడుతుంది. అలాగే గుండె జబ్బులు రాకుండా అడ్డుకట్ట వేస్తుంది.
ఆరోగ్యకరమైన నిద్ర : ప్రతిరోజు పడుకునే ముందు కాస్త పచ్చికొబ్బరిని తినడం వల్ల హాయిగా నిద్ర పడుతుంది. దీనిలో ఉండే పొటాషియం, మెగ్నీషియం కండరాలకు ప్రయోజనం చేకూరుస్తుంది. అలాగే నిద్రకు సహాయపడుతుంది.
చర్మ సంరక్షణ : కొబ్బరిలో అధికంగా ఫ్యాటీ కంటెంట్ చర్మానికి పోషనను ఇవ్వడమే కాకుండా చర్మాన్ని తేమగా ఉంచి మృదువుగా చేస్తుంది. దీనిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు చర్మాన్ని మొటిమల నుండి రక్షిస్తాయి.
బరువు సమస్య : పచ్చికొబ్బరి లో ఉండే ఫైబర్ కంటెంట్ శరీరంలోని అదనపు కొవ్వును కరిగించడంలో సహాయం చేస్తూ కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది.
జీర్ణ చికిత్స : జీర్ణ సంబంధిత సమస్యలను పచ్చికొబ్బరి నియంత్రించడమే కాకుండా ఇందులో ఉండే గుణాల వల్ల ఆహారం వేగంగా జీర్ణం అవుతుంది.