Romance Benefits: ఆధునిక కాలంలో శృంగారానికి ఆసక్తి తగ్గిపోతోంది. పని ఒత్తిడి, వాతావరణం, జీవనశైలి తదితర కారణాలతో చాలామంది శృంగారానికి దూరమైపోతున్నారు. దీంతో రోగాల బారిన పడే అవకాశం ఉంది. భాగస్వామితో బంధం బలంగా ఉండాలంటే శృంగారం తప్పనిసరి.
అమెరికాలో 2016లో జరిపిన ఓ అధ్యయనంలో తరచుగా శృంగారంలో పాల్గొనే వారిలో రోగ నిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది. ఇమ్యునోగ్లోబులిన్ ఎ యాంటీ బాడీని విడుదల చేసినట్లు చెబుతున్నారు. గుండె జబ్బులు రాకుండా చేస్తుంది. రక్తప్రసరణను బాగు చేస్తుంది. శృంగారం వల్ల ముఖ్యమైన హార్మోన్లు విడుదలవుతాయి.
ఎండార్ఫిన్, ఆక్సిటోనిన్ లు మంచి నిద్ర వచ్చేలా చేస్తాయి. ఆందోళన, నిరాశను తగ్గిస్తుంది. శృంగారంతో ఇన్ని లాభాలు ఉండటంతో ఒత్తిడి, ఆందోళన దూరమవుతాయి. శృంగారం లేకపోతే శారీరక, మానసికంగా కల్లోలం కలుగుతుంది. శృంగారం దూరమైతే మెదడు సరిగా పనిచేయదు. ఒకరిపై మరొకరికి విశ్వాసం పెరగాలంటే శృంగారమే ప్రధానంగా నిలుస్తోంది.
Also Read : Why Periods Women Not Go to Temple
మెనోపాజ్ తరువాత ఈస్ట్రోజన్ ను శరీరం ఎక్కువగా ఉత్పత్తి చేసినప్పుడు యోని గోడలు కుంచించుకుపోతాయి. యోని కణజాలం సన్నబడుతుంది. దీంతో అసౌకర్యంగా అనిపించవచ్చు. వారానికి కనీసం ఒకటి రెండు సార్లు శృంగారంలో పాల్గొనడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కలయికకు దూరంగా ఉండే వారిలో ఇన్ఫెక్షన్ల ముప్పు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
మహిళలు సంభోగంలో పాల్గొన్న సమయంలో భావప్రాప్తి కలగొచ్చు. సుదీర్ఘ విరామం తరువాత శృంగారం చేయడం వలన ఇతర సమస్యలతో పాటు ఉద్వేగాలు పెరుగుతాయి. అందుకే అప్పుడప్పుడు శృంగారంలో పాల్గొంటేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎంతో హాయిగా అనిపిస్తుంది. మహిళలు, పురుషులు ఇద్దరికీ కూడా శృంగారమే పరమ ఔషధంగా పని చేస్తుంది.