Rose Water Face Mist : అమ్మాయిలు తమ చర్మం ఎప్పుడూ కూడా మచ్చలు లేకుండా కాంతివంతంగా ఉండాలని కోరుకుంటారు. చర్మం ఈరకంగా ఉండాలంటే రోజ్ వాటర్ పేస్ట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. రోజ్ వాటర్ వల్ల చర్మానికి సంరక్షణ కలగడమే కాక మంచి పోషణ కూడా లభిస్తుంది.
రోజు వాటర్ లో ఉండే గుణాలు చర్మం లో ఉన్న PH స్టాయిని పెంచి మొటిమలు, వడదెబ్బ, నల్లటి మచ్చలు, ముడతలు రాకుండా నివారిస్థాయి. ఎండాకాలంలో చర్మం ఎక్కువగా పాడవుతుంది. ఎండవేడికి కమిలి పోవడం లాంటివి జరుగుతాయి. ఎండాకాలంలో చర్మాన్ని రక్షించుకోవాలంటే ఈ రోజ్ వాటర్ పేస్ట్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
రోజ్ వాటర్ పేస్ట్ ఎలా తయారు చేయాలి అంటే.. ముందుగా రోజు వాటర్ నీ ఒక బౌల్లో తీసుకొని, సన్నని మంట పైన వేడి చేయాలి. దాంట్లో గులాబీ ఆకులను వేసి ఒక 45 నిమిషాల పాటు ఉంచాలి. ఆకులు రంగు మారిన తర్వాత స్టవ్ పై నుంచి తీసి ఆ నీటిని చల్లార్చి వడకట్టుకోవాలి.
తర్వాత ఇందులో విటమిన్ ఇ నూనెను వేసి మిక్స్ చేసుకోవాలి. ఈ పేస్ట్ క్రమం తప్పకుండా వాడడం వల్ల చర్మానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.