Scientific Reason behind Women Wearing Bangles : ఆడవారు చేతులకు గాజులను ధరించడం అలంకరణ కోసమని అనుకుంటారు. కానీ గాజులను ధరించడం వెనక ఒక సైంటిఫిక్ రీసన్ కూడా దాగి ఉంది. మరి గాజులను ధరిస్తే ఆరోగ్యానికి మంచి జరుగుతుందా.. లేకపోతే ఏవైనా సమస్యలు ఎదురవుతాయా అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం.
రక్త ప్రసరణ : మహిళలు చేతులకు గాజులు వేసుకోవడం వల్ల మణికట్టు ప్రాంతంలో రక్తప్రసరణ పెరిగి, సజావుగా సాగుతుందంట. మణికట్టు ప్రదేశంలో రాపిడికి గురై రక్తప్రసరణ వేగం కూడా పెరిగి వారు ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడతాయి.
గర్భిణీ స్త్రీలు : గర్భిణీ స్త్రీలు రెండు చేతులకు గాజులు ధరిస్తే మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే వారికి సీమంతం చేసి గాజులు వేస్తారు. ఈ గాజుల శబ్దం వల్ల కడుపులోని బిడ్డకు ఊరట ఇవ్వడమే కాకుండా, శిశువులో వినికిడి శక్తి కూడా పెరుగుతుందంట. గాజులు వేసుకోవడం వల్ల హార్మోన్ల అసమాతుల్యాత సమస్య తొలగిపోతుంది. గాజుల శబ్దం తల్లి, కడుపులో ఉన్న బిడ్డకు ఒత్తిడి లేకుండా చేస్తుంది.
గాజులు ధరించడం వల్ల ప్రయోజనాలు : ఆడవాళ్ళ చేతికి గాజులు ధరించడం వల్ల అవి ముందుకు, వెనుకకు కదులుతుంటే రక్తనాళాలకు మసాజ్ అవుతూ రక్తప్రసరణ మెరుగుపడుతుంది. ముఖ్యంగా శరీరంలో శక్తి స్థాయిలు పెరిగి అలసట, ఒత్తిడి, తగ్గి నొప్పులను భరించే శక్తిని మన శరీరానికి గాజులు అందిస్తాయి. శరీరంలో వేడిని తగ్గించడంలో మట్టి గాజులు ప్రధాన పాత్రను పోషిస్తాయి.
ఈ గాజులలో ఎరుపు, ఆకుపచ్చ రంగు గాజులు చాలా ప్రత్యేకమైనవి. ఈ రంగు గాజులు ధరిస్తే శరీరానికి చాలా మంచిది. మానసిక ప్రశాంతతను కూడా పొందవచ్చు. ఎక్కువగా మహిళలు ఈ రంగు గాజులని ఇష్టపడతారు. అయితే కొన్ని అధ్యయనాల ప్రకారం మాత్రం గ్లాస్ బ్యాంగిల్స్ ధరించిన మహిళలు ఎక్కువగా భావోద్వేగానికి గురవుతున్నట్టు తేలింది. వారు ఎల్లప్పుడూ కూడా సానుకూల దృక్పథంతో ఉంటారంట. మరి ఇంకెందుకు ఆలస్యం గాజులు వేసుకోవడం అలవాటు లేని వాళ్ళు వాటి ఉపయోగాలు తెలుసుకొని వెంటనే వేసుకోవడం మంచిది.