Six Ways to Lose Weight : ఈ రోజుల్లో అధిక బరువు అనేది అందరినీ కంగారు పెడుతున్న విషయం. అధిక కొవ్వుతో బరువు సమస్యను ఎదుర్కొంటున్నారు. ఒక ఆరు అలవాట్లను మానుకుంటే అధిక బరువు సమస్య నుంచి బయటపడవచ్చు. ఆ ఆరు అలవాట్లు ఏమిటో ఆలస్యం చేయకుండా వెంటనే తెలుసుకుందాం..
■ శీతల పానీయాలను తీసుకోక పోవడం మంచిది. ఎందుకంటే శీతల పానీయాలలో చక్కెర శాతం అధికంగా ఉంటుంది. వాటిలో కేలరీలు కూడా ఎక్కువగా ఉంటాయి. తద్వారా శరీరంలో కొవ్వు పెరుగుతుంది.
■ నిద్ర కూడా బరువును పెంచడంలో ఎక్కువగా దోహదం చేస్తుంది. నిద్రలేమి కారణంగా కొవ్వు పెరుగుతుంది. ప్రతి మనిషి రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంటలు కచ్చితంగా నిద్రపోవాలి. ఒత్తిడికి, ఉబకాయానికి కారణమవుతుంది.
■ బరువు తగ్గడానికి, బెల్లీ ఫ్యాట్ లాంటిది కరిగించుకోవడానికి చాలా మంది చేసే పెద్ద పొరపాటు ఆహారం తినడాన్ని ఆపేస్తూ ఉంటారు. ఇది అసలు చేయకూడదు. అలా ఆపి, ఆపి ఒకేసారి తినడం వల్ల ఇంకా బరువు ఎక్కువగా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి సరైన టైమ్ కి సరైన ఆహారం తీసుకుంటే సరిపోతుంది.

■ కొవ్వు ఉన్న పదార్థాలను తీసుకోకపోవడం మంచిది. అధిక కొవ్వు పదార్థాలు తినడం వల్ల, శరీరంలో కొవ్వుశాతం పెరిగిపోతుంది. బరువు పెరగడానికి ఇది కూడా చాలా ముఖ్య కారణం.
■ ప్రతి మనిషికి రోజు వ్యాయామం తప్పనిసరి. ప్రతిరోజు గంట నుండి గంటన్నర వరకు నడవాలి. ఒకే చోట కూర్చోవడం వల్ల అధిక బరువు పెరగడానికి అవకాశం ఇచ్చినట్లు అవుతుంది.
■ ప్రతి ఒక్కరు మనసును ఎప్పుడు ప్రశాంతంగా ఉంచుకోండి. ప్రతికూల ఆలోచనలతో ఉంటే బరువు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి మనిషికి మనశ్శాంతి చాలా అవసరం.
ఈ ఆరు అలవాట్లను తోపాటు అవసరమైన ఆహారాన్ని కూడా తీసుకోవాలి. ముఖ్యంగా ప్రోటీన్లు, కొవ్వు, పిండి, ఫైబర్ ఉండేలాగా చూసుకోవాలి. విటమిన్లు, ఖనిజాలు లభించే ఆహారం తినాలి. ప్రతిరోజు వ్యాయామం కచ్చితంగా చేయాలి. 70 శాతం ఆహారాన్ని తీసుకున్నవారు 30% వ్యాయామం చేస్తే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. మరో ముఖ్య విషయం ఏమిటంటే గంటల తరబడి ఒకే చోట కూర్చోకూడదు ఇలా చేస్తే కచ్చితంగా బరువు పెరుగుతారు. పుచ్చకాయ, దోసకాయ, పైనాపిల్, ఆరెంజ్, కివి, బొప్పాయి వంటి పండ్లను తీసుకుంటే అవి బరువు తగ్గడంలో చాలా ఉపయోగపడతాయి.
