Skin Care Tips : మనం ఏమాత్రం మన ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చూపక పోయినా.. ఆ ఎఫెక్ట్ చర్మం మీద పడుతుంది. అంటే సరిగ్గా నిద్ర లేకపోవడం, సరైన ఆహారం తినక పోవడం, వాతావరణ కాలుష్యం, మద్యపానం, ధూమపానం, కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చుని వర్క్ చేయడం ఇలాంటి విషయాలు ఆరోగ్యం మీద చాలా ప్రభావం చూపిస్తాయి.
అలాంటప్పుడు ఆ ప్రభావం చర్మం పై కూడా పడుతుంది. చర్మం వెంటనే కాంతి విహీనం అయిపోతుంది. చర్మం అలా కాంతి విహీనం అయినప్పుడు, కాంతివంతమైన చర్మాన్ని పొందడం ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఒక కప్పు గులాబీ రేకులను నీటిలో శుభ్రంగా కడిగి ,
మిక్సీ జార్ లో వేసుకొని, అందులో రెండు టేబుల్ స్పూన్స్ పంచదార, కోకొనట్ ఆయిల్ రెండు స్పూన్లు, ఒక టేబుల్ స్పూన్ తేనె వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకొని పది నిమిషాలు ఆరనివ్వాలి.
ఆ తర్వాత మొహం పైన సున్నితంగా వేళ్ళతో మర్దన చేసి తర్వాత నీళ్లతో శుభ్రంగా మొహాన్ని కడగాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై పేరుకుపోయిన మురికి తొలగిపోయి, డల్ గా ఉన్న చర్మం క్షణాల్లో కాంతివంతంగా మారుతుంది. అంతేకాదు చర్మ ఛాయాకు కూడా ఈ రెమెడీ చాలా బాగా పనిచేస్తుంది.
రెండు రోజులకొకసారి ఈ మిశ్రమాన్ని చర్మానికి అప్లై చేయడం వల్ల చర్మఛాయలో చాలా మార్పు కనిపిస్తుంది. ఈ రెమిడీతో మరో ఉపయోగము కూడా ఉంది. మొటిమల సమస్యలతో బాధపడుతుంటే ఈ రెమిడీ ఆ సమస్యను తీరుస్తుంది. మొటిమలను దరిదాపుల్లోకి కూడా రానివ్వదు. చర్మం సహజంగానే అందంగా కాంతివంతంగా మెరుస్తుంది.