Skin Care Tips : అందరికి వయసు పై బడుతుంటే చర్మంలో ముడతలు రావడం సహజం. కానీ ఈరోజుల్లో చిన్న వయసు వారు కూడా ఈ ముడతల సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యకు చాలా కారణాలు ఉన్నాయి. ఆహారపు అలవాట్లలో మార్పు, పోషకాల కొరత, వాతావరణ కాలుష్యం,
ఒత్తిడి, కంటి నిండా నిద్ర లేకపోవడం, ధూమపానం, మద్యపానం లాంటి అలవాట్లు ఉండడం. ముఖ్యంగా ముఖం పైన ముడతలు రావడానికి కారణాలు.ఈ సమస్య నుంచి తప్పించుకోవడానికి మంచి హోమ్ రెమిడి ఒకటి ఉంది. దానిని వాడితే ముడతలు పడే చర్మాన్ని నివారించవచ్చు.
ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ గ్రీన్ టీ పౌడర్, రెండు టేబుల్ స్పూన్లు వాటర్ పోసి బాగా కలిపి ఐదు నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి. తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ గోధుమ పిండి వేసి మిక్స్ చేసి, చివరిగా ఒక ఎగ్ వైట్ ను వేసి మరోసారి అన్నీ కలిసేంత వరకు మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని బ్రెష్ సహాయంతో
చర్మానికి కొంచెం మందంగా అప్లై చేసి, ముప్పై నిమిషాల పాటు చర్మాన్ని అరబెట్టి తర్వాత నీళ్లతో శుభ్రంగా క్లిన్ చేసుకోవాలి. రోజుకు ఒకసారి ఇలా చేస్తే సాగిన చర్మం టైట్ గా మారి, ముడతలు కొద్ది రోజుల్లోనే తగ్గిపోయి, ముఖ చర్మం యవ్వనంగా, కాంతివంతంగా మారుతుంది.
ఆలస్యం చేయకుండా ఈ రెమిడి ఫాలో అయిపోయి ఆకర్షణనీయమైన అందాన్ని మీ సొంతం చేసుకోండి.